త్రిష పై మరో కాంట్రవర్సీ…!

Actress Trisha

ఈ మధ్యకాలంలో త్రిష పై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. మొన్నీ ఈమధ్య కాలంలో లియో సినిమాలో నటించిన మన్సూర్ అలికాన్ త్రిష మధ్య ఒక కాంట్రావెర్సీ నడిచింది.

లియో చిత్రంలో త్రిషతో రేప్ సన్నివేశాలు లేకపోవడంతో తాను చాలా నిరాశకు గురయ్యానని ఒక ఇంటర్వ్యూ లో మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

ADVERTISEMENT

అటు తమిళ పరిశ్రమతో పాటుగా ఇటు తెలుగు సినీ ప్రముఖులు మెగాస్టార్ వంటి వారు కూడా త్రిషకు అండగా నిలిచారు. దీనితో ఇక చేసేదేమి లేక త్రిషకు క్షమాపణలు చెప్పారు మన్సూర్. ఈ వివాదం ముగిసిన కొద్దీ రోజులకే మళ్ళీ అదే తరహా వ్యాఖ్యలు చేస్తూ త్రిషను అగౌరవపరిచారు అన్నాడీఎంకే పార్టీ నేత ఏవీరాజు.

గతంలో గౌవత్తూర్లో ఒక పంక్షన్ కు హాజరైన త్రిషను చూసి స్థానిక ఎమ్మెల్యే ఆమె పై మనసుపారేసుకున్నారని, ఆమెతో ఒక్క రోజు గడపడానికి 25 లక్షలు చెల్లించారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు రాజు. దీని పై త్రిష న్యాయపోరాటానికి సిద్ధం అంటూ ఒక ప్రకటన విడుదల చేసారు.

ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఇటువంటి వారు ఏ స్థాయికైనా దిగజారాలారని, ఇటువంటి వారిని చూస్తుంటే అసహ్యంగా ఉంటుందని త్రిష తన ఆవేదన వ్యక్తం చేసారు. మన్సూర్ పై త్రిష చేసిన పోరాటానికి ప్రతిఫలంగా ఆయన నుంచి క్షమాపణలు అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మరో సారి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.

ఇలా వరుస పెట్టి తనకు సంబంధం లేకుండా వివాదాలలో ఇరుక్కోవడం, ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు ఎదురుకోవడం త్రిషకు, ఆమె అభిమానులకు అత్యంత ఆవేదన కలిగించే అంశం. మరి ఈవిషయంలో రాజకీయ నాయకులను ఎదిరించి త్రిష వెన్నంటి ఉండి ఆమెకు మద్దతుగా నిలవడానికి సినీ ఇండస్ట్రీ ముందుకొస్తుందా..?

ADVERTISEMENT
Latest Stories