చక్కని ‘చుక్క’ ఏది కట్టినా ‘అందమే’ అన్నట్టు… చెక్స్ డ్రెస్ లో మెరిసిపోతున్న చెన్నై సోయగం త్రిష ఈ స్టిల్ తో వీక్షకులను అలరిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో త్రిష ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న “నాయకి” సినిమా మోషన్ పిక్చర్ విడుదల చేసిన సందర్భంలోని దృశ్యం ఇది. ఈ ఫోటోలో కనిపిస్తున్న మరో ఇద్దరు “నాయకి” సినిమా సంగీత దర్శకుడు రఘు కుంచె, దర్శకుడు గోవి గోవర్ధన్.
ఈ ఫోటో మాదిరే ‘నాయకి’ సినిమా మోషన్ పిక్చర్ కూడా చూపరులను ఆకర్షిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లో పల్లెటూరు వాతావరణంలో త్రిష ఊయల ఊగుతూ దర్శనమిస్తోంది. రఘు కుంచె బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆహ్లాదకరంగా ఉండగా, చాలా కాలం తర్వాత ఓ తెలుగు చిత్రంలో త్రిష కనువిందు చేస్తోంది. హార్రర్ కధా నేపధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, సత్యం రాజేష్, జయ ప్రకాష్, కోవై సరళ తదితరులు నటించారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



