చాలా అరుదుగా స్టేజ్ వేడుకలపై ప్రసంగించే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి అయితే ఒళ్ళు పులకరించే విధంగా త్రివిక్రమ్ ప్రసంగిస్తూ ఉంటారు. అయితే “అజ్ఞాతవాసి” ఆడియో వేడుకలో చేసిన స్పీచ్ మాత్రం ఇందుకు మినహాయింపు. రొటీన్ గా ఆడియో వేడుకలపై డైరెక్టర్లు చేసే ప్రసంగాలకు విరుద్ధంగా, గుక్క తిప్పుకోకుండా మాట్లాడే త్రివిక్రమ్, ఈ సారి మాత్రం ‘రొటీన్’ విధానాన్నే ఫాలో అయ్యారు.
తన సినిమాలోని ఒక్కో సభ్యుడి గురించి ఆచితూచి మాట్లాడుతూ… తనకు రాని విద్యను ప్రదర్శించినట్లుగా కనపడింది. చిత్ర యూనిట్ సభ్యుల గురించి చెప్పడానికి కష్టపడిన త్రివిక్రమ్ శైలిని ఈ సారి పవన్ అభిమానులు సహనంతో వినడం ప్రశంసించదగ్గ అంశం. అయితే ఒకానొక దశలో మాత్రం ‘సిఎం… సిఎం…’ నినాదాలు చేయగా… ‘వస్తా వస్తా… ఆయన దగ్గరికే వస్తా…’ అంటూ కొనసాగించిన స్పీచ్ లో “ఈ సినిమాలో పవన్ నట విశ్వరూపాన్ని చూస్తారు” అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.
త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచ్ లో పవన్ గురించి చెప్పిన ఈ ఒక్క ముక్క తప్ప, మిగతా బోరింగ్ గా సాగడం చాలా అరుదుగా జరిగే విషయం. ఇక పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం భవిష్యత్తులో కూడా కొనసాగాలని, అది సినిమాల వరకు మాత్రమే అంటూ… ‘జనసేన’లో త్రివిక్రమ్ చేరతారు అంటూ… తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు ఈ ‘మాటల మాంత్రికుడు.’



