త్రివిక్రమ్ కూడా చెప్పేసాడు… ఇక రాజమౌళి రివ్యూనే..!

Trivikram Srinivas Praises Jyo Achyutananda, Trivikram Srinivas Response Jyo Achyutananda, Trivikram  About Jyo Achyutananda, Trivikram Jyo Achyutanandaవారాహి ప్రొడక్షన్స్ పై శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన “జ్యో అచ్యుతానంద” సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినూత్నమైన కాన్సెప్ట్ తో ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలు పెంచిన ఈ సినిమా ఆడియో వేడుకకు విచ్చేసి తన అండదండలు ఉంటాయని చెప్పకనే చెప్పాడు. ఇక, సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది మరికొంత మంది దర్శకులు ఈ సినిమాకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు.

ADVERTISEMENT

ఇప్పటికే సుకుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియో విడుదల చేయగా, తాజాగా ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన భావాలను పంచుకున్నారు. “ఒక నటుడు దర్శకుడిగా రాణించలేడన్న నమ్మకం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉందని, దానిని శ్రీనివాస్ అవసరాల బ్రేక్ చేసాడని, తను ఇప్పటికీ ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా చూస్తుంటానని, అంతలా ఆ సినిమా నన్ను ఆకట్టుకుందని, ఈ సినిమా కధ కూడా తనకు తెలుసని, ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్న నమ్మకం తనకుందని” త్రివిక్రమ్ చెప్పిన మాటలు ప్రేక్షకులను ప్రభావితం చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాలా..!

ఇక, మిగిలింది రాజమౌళి రివ్యూనే! వారాహి సంస్థ నిర్మిస్తున్న సినిమాలను ఫస్ట్ డేనే చూసి, తన స్పందన వెలిబుచ్చడం సాధారణంగా జరిగే విషయం. ఇక, రాజమౌళి రివ్యూ కూడా ఇదే రీతిలో పాజిటివ్ గా వచ్చేస్తే… “జ్యో అచ్యుతానంద”కు ఆనందమానందమే..! అయితే సుకుమార్, త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ బేస్ చేసుకుని మాట్లాడగా.., జక్కన్న మాత్రం ధియేటర్లో సినిమా చూసి చెప్తారు. మరి జక్కన్న ఎలాంటి తీర్పు చెప్తారో చూద్దాం..!

ADVERTISEMENT
Latest Stories