ఫ్లాష్ ఫ్లాష్… సంపూతో త్రివిక్రమ్ శ్రీనివాస్..!

Trivikram Srinivas with Sampoornesh Babuటాలీవుడ్ టాప్ హీరోలు పవన్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్లతో వరుసగా సినిమాలను లైన్ లో పెట్టిన ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబుతో ఏంటి అనుకుంటున్నారా? కొంపతీసి వీరిద్దరూ సినిమా ఏమైనా చేయబోతున్నారా? అన్న ప్రశ్న వస్తే అవాక్కవ్వాల్సిందే. మ్యాటర్ అది కాదు గానీ, తాజాగా సోషల్ మీడియాలో త్రివిక్రమ్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి సందడి చేసాడు సంపూ.

“గురువు గారైన త్రివిక్రమ్ తో గంటసేపు ప్రయాణం, లైబ్రరీని చేతిలో పట్టుకెళ్ళినట్లుందని, హృదయకాలేయం, కొబ్బరిమట్ట సినిమా డైలాగ్స్ ను ఆయన పొగిడారని” ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు సంపూ. అయితే ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించారో చెప్పలేదు గానీ, త్రివిక్రమ్ తో కలిసి ఓ గంటసేపు మాట్లాడే అవకాశం దక్కడమంటే మామూలు విషయం కాదు కదా… అందుకే సంపూ సంతోషంతో వెంటనే ట్వీట్ చేసేసారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories