ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎన్ని నీతిసూక్తులు, హామీలు గుప్పించినా పోలింగ్ తేదీ సమయం దగ్గరకు వచ్చే సమయానికి చివరకు ‘డబ్బులు’ పంచే కార్యక్రమం మీదే దృష్టి పెడతారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికలలో డబ్బులు పంచుతున్న కేటీఆర్ అనుచరుడు, సిరిసిల్ల ఎంపిపి కారులో లభ్యమైన డబ్బును, కారును పోలీసులు సీజ్ చేసారు.
నిజాంపేట రోడ్డులోని నాగార్జున హోమ్స్ లో టీఆర్ఎస్ వర్గం డబ్బులు పంచుతుండగా, టిడిపి ఎమ్మెల్యే గాంధీ అధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించారు. గత పది రోజులుగా నిజాంపేటలో మద్యం, మనీ పంచుతున్నారని అధికార పార్టీపై టిడిపి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా పోలీసు వర్గాలు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో స్వయంగా టిడిపి ఎమ్మెల్యే రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వడంతో 3 లక్షల నగదును, కారును పోలీసులు సీజ్ చేసారు.
ADVERTISEMENT
ADVERTISEMENT





