పాతర వేస్తామన్న ఛానల్ కే ప్రత్యేక ఇంటర్వ్యూ!

trs-minister-ktr-exclusive-interview-with-abnతెలంగాణా గడ్డ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కు – ఏబీఎన్ మీడియా ఛానల్ కు మధ్య జరిగిన ప్రత్యక్ష యుద్ధం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వీరిద్దరి అంశానికి ఇటీవల తెరపడిన విషయమూ తెలిసిందే. తమకు ఎదురు తిరిగితే సహించేది లేదన్న ఏబీఎన్ ఛానల్ లోనే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సందర్భంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ రెండు రోజుల క్రితం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

మేయర్ పీఠమే లక్ష్యంగా దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గ్రేటర్ లోని సీమాంధ్రుల ఓట్లను ఆకర్షించేందుకే కేటీఆర్ ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారని పొలిటికల్ వర్గాల టాక్. తెలుగుదేశం పార్టీకి ప్రత్యక్షంగానే సహకారం అందించే సదరు ఛానల్ కు గ్రేటర్ పరిధిలో వీక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందనే కొలమానంతో కేటీఆర్ చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు.

ADVERTISEMENT

‘అధికారం’లో ఉన్న మాయ అంటే ఇదే అంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు ఈ ఛానల్ అంతు చూస్తామని ప్రకటించిన వారే, అదే ఛానల్ లో ఎవ్వరికీ ఇవ్వని విధంగా ఇంటర్వ్యూ ఇవ్వడం వెనుక రహస్యమిదే. మరి కేటీఆర్ అండ్ కో చేసిన ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అయ్యిందో తెలియాలంటే జీహెచ్ఎంసీ ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories