ఏడు యుద్ధాలు ఆపిన శాంతి దూత డోనాల్డ్ ట్రంప్ ఎంతగా ఆరాటపడినా నోబుల్ శాంతి బహుమతి దక్కలేదు. అత్యున్నతమైన ఈ అవార్డుని వెనిజువెలకు చెందిన పౌరహక్కుల ఉద్యమకారిణి మరియా కోరినా మచాడోకు లభించింది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి మొత్తం 338 నామినేషన్స్ రాగా వారిలో మరియా కోరినాను నోబుల్ కమిటీ ఎంపిక చేసింది.
దీంతో ట్రంప్ తీవ్ర నిరాశ కలగడం సహజమే. వాణిజ్య సుంకాలతో, హెచ్-1బీ వీసాలపై ఆంక్షలతో యావత్ ప్రపంచదేశాలను గడగడలాడించిన తనకు ఈ అవార్డు ఇవ్వాల్సిందే అన్నట్లు ట్రంప్ మాట్లాడారు. కనుక ఇది ట్రంప్‌కు అహంకారానికి ఓ గుణపాఠం వంటిదని కూడా చెప్పవచ్చు. కనుక ఇది ఆయనలో పరివర్తన కలిగిస్తే కనీసం వచ్చే ఏడాది అవార్డు పొందవచ్చు.
కానీ ఈ అవార్డు కోసం ట్రంప్ మాట్లాడిన మాటలు, ప్రదర్శించిన అహంభావం, తాపత్రయం మాత్రం మిగిలిపోయాయి. వాటి కారణంగా నవ్వులపాలవుతారు.
యావత్ ప్రపంచాన్ని శాశించే తనకు నోరు తెరిచి అడిగినా ఈ అవార్డు ఇవ్వకపోవడం ట్రంప్ జీర్ణించుకోవడం కష్టమే. ఇది ఆయన అహాన్ని దెబ్బ తీస్తుంది కూడా. కనుక మళ్ళీ ఆయనలో అహంభావి బయటకు రావడం తధ్యం.
ఈ నోబుల్ బహుమతి కోసమే ట్రంప్ ట్రంప్ శాంతిదూతగా ముసుగు వేసుకున్నారు తప్ప ఇది ఆయన నిజ స్వరూపం కాదని అందరికీ తెలుసు. కనుక త్వరలోనే ట్రంప్ విశ్వరూపం ప్రదర్శించవచ్చు.
ఏడు యుద్ధాలు ఆపిన శాంతిదూత ట్రంప్, భారత్‌పై యుద్ధానికి పాకిస్తాన్‌కి సాయపడతారేమో?రష్యా-ఉక్రెయిన్ విషయంలో తల దూర్చి యుద్ధం ఆపడం కంటే ఉక్రెయిన్‌కి ఆయుధాలు అమ్ముకోవడం మంచిదనుకున్నా ఆశ్చర్యం లేదు.




