అగ్రరాజ్య పీఠంపై వీడిన ట్విస్ట్… అధ్యక్షుడ్ని తేల్చేసారు..!

Donald Trump wins electoral college voteఅమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే క్రమంలో చివరి పరీక్షలో కూడా డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అత్యంత కీలకమైన ఎలక్టోరల్ కాలేజ్ కూడా ట్రంప్ నే అధ్యక్షుడిగా ఎన్నుకుంది. దీంతో అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ఖరారయ్యారు. ట్రంప్ ను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు ఎంత ప్రయత్నించినప్పటికీ సఫలీకృతులు కాలేకపోయారు. తన విజయం పట్ల ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ… ‘వీ డిడ్ ఇట్’ అంటూ ట్వీట్ చేశారు.

ADVERTISEMENT

[m9ad]

ఈ అడుగుతో, ఇకపై మనం మరింత అభివృద్ధి దిశలో నడుద్దామని, దేశాన్ని సమైక్యం చేసే దిశగా సాగుదామని తెలిపారు. మరోవైపు, ట్రంప్ ను అడ్డుకోవడానికి మీడియా ఎన్ని అసత్యాలు రాసినా, డెమోక్రాట్లు ఎన్ని కుయుక్తులు పన్నినా… ఆయన మాత్రం అద్భుతమైన విజయాన్ని సాధించారని ట్రంప్ వర్గం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నవంబర్ 8న పోలింగ్ జరుగగా, 24 గంటల్లోపే ఎన్నికల ఫలితం వెలువడింది.

కానీ, అమెరికా రాజ్యాంగం ప్రకారం సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత… వాషింగ్టన్ డీసీ నుంచి ఎన్నికైన 538 మంది ఎలక్టోరల్ కాలేజ్ ఎలక్టర్లు… తమ తమ రాష్ట్ర రాజధానుల్లో సమావేశమై, దేశాధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తుది పరీక్షలో సైతం ట్రంప్ ఘన విజయం సాధించారు. జనవరిలో అగ్ర రాజ్య అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు.

ADVERTISEMENT
Latest Stories