కరోనా రక్కసి దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు కుదేలు అవుతున్నాయి. తెలంగాణ లో ఏప్రిల్ లోని మొదటి ఆరు రోజులకు 2,400 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం ఆరు కోట్లు మాత్రమే రావడం ఇందుకు నిదర్శనం. సరైన రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే ఊహించడానికే కష్టంగా ఉంది.
ఉన్నఫలంగా ప్రకటించిన లాక్ డౌన్ వల్ల నిరుపేదలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. తినడానికి తిండి, నిలువ నీడ లేక అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు కొంత మేర సాయం చేస్తున్నా అది అందరికీ చేరడం లేదు. అయితే తిరుపతి అర్బన్, రురల్ ఏరియాలలో ఈ పరిస్థితి లేదు. అక్కడి పేదల కోసం తిరుమల శ్రీవారే దిగివచ్చారు.
తిరుపతి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో లాక్డౌన్ సమయంలో నిరాశ్రయులకు మద్దతు ఇవ్వడానికి ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయం ఇప్పటికే రోజుకు 50,000 ఆహార ప్యాకెట్లను అందిస్తోంది. వారికి నీడను ఇవ్వడానికి తన అద్వర్యం లోని విశ్రాంతి గృహాలను కూడా తెరిచింది. దీనితో వారి సమస్యలు చాలా వరకూ తీరిపోయాయి.
ఇది ఇలా ఉండగా… తిరోమల తిరుపతి దేవస్థానం కరోనా రిలీఫ్ ఫండ్ కోసం ప్రభుత్వానికి 19 కోట్ల భారీగా విరాళం ఇస్తామని ప్రకటించింది. టిటిడి ఇప్పటికే చిత్తూరు జిల్లా ప్రభుత్వ అధికారులకు రూ .8 కోట్లను అందజేసింది, మిగిలిన రూ .11 కోట్లను త్వరలో వారికి అప్పగించనుంది.



