“డ్రంక్ అండ్ డ్రైవ్” తనిఖిల్లో దొరికిపోయిన టాప్ యాంకర్!… జైలు శిక్ష తప్పదా..?

TV Anchor Pradeep caught on Drunk and Drive Case2018 తొలి క్షణాలను ఫుల్లుగా మందుకొట్టి ఆస్వాదించాలని భావించిన వారికి హైదరాబాద్ పోలీసులు చుక్కలు చూపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో దాదాపు 5 వేల మందికి పైగా పోలీసులు వివిధ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఆదివారం నాడు అర్థరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుగగా, మొత్తం 1200కు పైగా కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారందరి వాహనాలనూ సీజ్ చేశామని, వీరందరికీ మంగళవారం నాడు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి, కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు.

ADVERTISEMENT

ఈ తనిఖిల్లో భాగంగా జూబ్లీహిల్స్ లో ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ పట్టుబడ్డాడు. సాధారణంగా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 35 పాయింట్లు దాటితే, వాహనం సీజ్, శిక్ష తప్పదు. ఇక గత రాత్రి యాంకర్ ప్రదీప్ కు అయితే ఏకంగా 178 పాయింట్లు వచ్చాయి. అంటే, ఇది చాలా అధికమనే చెప్పవచ్చు. సాధారణంగా ఒక పెగ్గు తాగితే 30 నుంచి 32 పాయింట్ల వరకూ బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిజల్ట్ చూపుతుంది. ఇక ప్రదీప్ కు 178 పాయింట్లు వచ్చాయంటే, కనీసం హాఫ్ బాటిల్ వరకూ తాగుండాలి. ఇప్పటి నిబంధనల ప్రకారం, 100 పాయింట్లు దాటి పట్టుబడితే, రెండు రోజుల నుంచి వారం రోజుల జైలు శిక్ష విధిస్తున్నారు.

దీనికి కూడా వ్యక్తి హోదా, నడుపుతున్న వాహనం, ఎన్నోసారి పట్టుబడ్డాడన్న విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ మేరకు ఇప్పటికే నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలను అనుసరించి ప్రదీప్ కు జైలు శిక్ష తప్పదని పోలీసు వర్గాలు అంటున్నాయి. గత రాత్రి ఆయన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, మంగళవారం నాడు కౌన్సెలింగ్ కు, కోర్టుకు హాజరయ్యేందుకు రావాలని ఆదేశించారు. దీంతో కొత్త సంవత్సరం వేడుకలు కాస్తా యాంకర్ ప్రదీప్ కు విషాదంగా మారాయి.

ADVERTISEMENT
Latest Stories