ఉండ్రాజవరంలో ఏం జరుగుతోంది?

Undrajavaram Vangaveeti Ranga statue row

తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం గాంధీబొమ్మ సెంటర్‌లో వంగవీటి మోహన రంగా సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. కానీ రాత్రి అది మాయం అయ్యింది.

కనుక మళ్ళీ రంగా అభిమానులు మరో విగ్రహం తీసుకువచ్చి అక్కడ ఏర్పాటు చేయబోతే ఈసారి పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ADVERTISEMENT

వైఎస్సార్‌సీపీ నేత వంగవీటి నరేంద్ర అక్కడే వంగవీటి విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వినక పోవడంతో జేసీబీతో ఆ దిమ్మని తొలగించారు.

దీంతో వారికీ, పోలీసులకు మద్య తీవ్ర వాగ్వావాదాలు, తోపులాటలు జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న వంగవీటి కుమార్తె ఆశాకిరణ్ అక్కడకు చేరుకున్నారు.

అప్పటికే తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న వాతావరణం ఆమె రాకతో మరింత ఉద్రిక్తంగా మారింది. తన తండ్రి విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె అక్కడే రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగారు.

అక్కడ వంగవీటికి ఎంతమంది వీరాభిమానులున్నారో, వ్యతిరేకించేవారు కూడా అంతే మంది ఉన్నట్లు సమాచారం. బహుశః అందుకే అయన విగ్రహం ఏర్పాటు ఉద్రిక్తతలు సృష్టిస్తుందని పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం.

అయితే ఇది కేవలం వంగవీటి విగ్రహం ఏర్పాటులో ఎదురైన సమస్య మాత్రమే అనిపించడం లేదు. కాపుల ప్రస్తావన వచ్చిన ప్రతీసారి వైసీపీ పేరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వినిపిస్తూనే ఉంటుంది. ఈ వ్యవహారంలో వైసీపీ నేత నరేంద్ర వంగవీటి ఉన్నందున, ఇది వైసీపీ చేస్తున్న రాజకీయమా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కనుక ఇది కేవలం ఆయన విగ్రహం ఏర్పాటు వ్యవహారమే అయితే, పోలీసులు, ప్రభుత్వం దీనిని వీలైనంత త్వరగా పరిష్కరించడం చాలా అవసరం. లేకుంటే ఈ సమస్య రాష్ట్రమంతా కార్చిచ్చులా వ్యాపిస్తుంది. అప్పుడు ఈ విగ్రహాల ఏర్పాటు పేరుతో రాజకీయాలు మొదలయ్యే ప్రమాదం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories