భావనపై లైంగిక దాడికి కారణం ఇదే!

Updates on Bhavana molestation caseగత ఫిబ్రవరి 17న కేరళలోని ఎర్నాకుళం సమీపంలో షూటింగ్ పూర్తి చేసి స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న సినీ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో సిట్ అధికారులు బలమైన సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అందులో దిలీప్ రెండవ భార్య మంజు వారియర్ తో సినీ నటి భావనకు మంచి స్నేహం ఉందని పోలీసులు తెలిపారు.

ADVERTISEMENT

దిలీప్ వ్యవహార శైలితో వారి దాంపత్యంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. ఆ క్రమంలో కావ్యమాధవన్‌ తో దిలీప్ కు ఉన్న వివాహేతర సంబంధాన్ని భావన పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న దిలీప్… పల్సర్ సునీ సాయంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని చార్జిషీట్ లో సిట్ పేర్కొంది.

ఈ కేసులో పల్సర్ సునీని మొదటి ముద్దాయిగా పేర్కొన్న సిట్ అధికారులు, దిలీప్ ను 8వ ముద్దాయిగా పేర్కొన్నారు. ఈ కేసులో మొదటి సాక్షిగా బాధితురాలు భావనను సిట్ పేర్కొంది. మంజు వారియర్, కావ్యమాధవన్ తో పాటు మాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మరో 50 మందిని సాక్షులుగా ఛార్జిషీట్ లో సిట్ పేర్కొంది.

ADVERTISEMENT
Latest Stories