అమెరికా ఫస్ట్ అంటూ వచ్చిన ట్రంప్‌….

US-Iran Conflict: Trump Faces Global Isolation

అమెరికా వద్ద తిరుగులేని ఆయుధ సంపత్తి ఉంది. అయినా ఇరాన్‌ విషయంలో ఎదురుదెబ్బలు తింటూనే ఉంది. ఎందువల్ల? అంటే స్వార్ధంతో, అహంకారంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తుండటం వల్లనే.

వారం పది రోజులలో ముగిసిపోతుందనుకున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. అమెరికా కోరుకున్నా మేము యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఇరాన్‌ మరోసారి స్పష్టం చేసింది.

ADVERTISEMENT

ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలలో చమురు, గ్యాస్ కొరత పెరిగిపోతుండటంతో అమెరికా తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. దీని కంతటికీ కారణం చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ఇరాన్‌ చేతిలో ఉండటమే అని గ్రహించింది.

కానీ దానిని ఒంటరిగా స్వాధీనం చేసుకోవడం చాలా కష్టమని గ్రహించి, మిత్రదేశాలను అమెరికా సాయం కోరింది. తాను కనుసైగ చేయగానే మిత్రదేశాల యుద్ధ నౌకలు, విమానాలు వచ్చి అక్కడ వాలిపోతాయని ట్రంప్‌ అనుకుంటే, అవి తమకు సంబంధం లేని ఈ యుద్ధంలో కలుగజేసుకోవడానికి నిరాకరించడంతో షాక్ అయ్యారు.

ఒకవేళ అవి కూడా వచ్చి చేరి ఉంటే, వాటిని కూడా ఇరాన్‌ శ్రత్రువుగా పరిగణిస్తుంది. తమకు సంబంధం లేని యుద్ధంలో పాల్గొంటే అవి కూడా భారీగా నష్టపోతాయి. అంతేకాదు.. యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్‌ నుంచి చమురు నిలిచిపోతుంది. ఇరాన్‌తో అవసరం లేని శత్రుత్వం ఏర్పడుతుంది. కనుక అమెరికా మిత్ర దేశాలు ట్రంప్‌కి హ్యాండ్ ఇచ్చాయి.

దీనిని ట్రంప్‌ జీర్ణించుకోవడం కష్టమే. కానీ వేరే దారి లేదు. కనుక ‘ఎవరి సాయం లేకుండానే ఇరాన్‌ని ఓడిస్తాము.. ‘హర్మూజ్‌’ని స్వాధీనం చేసుకుంటాము.. ఎందుకంటే మాకు అపారమైన సైనిక, ఆయుధ సంపత్తి ఉంది. మా బలం ముందు ఇరాన్‌ నిలువలేదు,” అని ట్రంప్‌ సర్ది చెప్పుకున్నారు.

కానీ ట్రంప్‌ ఏడాది పాలనలోనే తన దుందుడుకు నిర్ణయాలతో ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశారు. అమెరికాని ఏకాకిగా చేశారు. ఇప్పుడీ యుద్ధంతో మిత్ర దేశాలను కూడా దూరం చేసుకున్నారు.

ఇంతకు ఇంతా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ చేస్తున్న శపధాలు అమెరికా పాలిట శాపాలుగా మారే ప్రమాదం పొంచి ఉంది.

ఇవన్నీగాక ఈ ఒక్క యుద్ధంతోనే లక్షల కోట్లు ఖర్చు చేసేస్తూ అమెరికా సంపద వేగంగా హరించివేస్తున్నారు. ఈ యుద్ధ ప్రభావం అమెరికా ఆర్ధిక వ్యవస్థపై కూడా తీవ్రంగా పడుతుంది. కనుక ‘అమెరికా ఫస్ట్’ అంటూ వచ్చిన ట్రంప్‌ స్వయంగా తన దేశాన్ని కోలుకోలేనంతగా దెబ్బ తీసుకుంటున్నారు. ఇందుకేనా ఆయనని ఎన్నుకున్నది? అని సగటు అమెరికన్ అనుకోకుండా ఉంటారా?

ADVERTISEMENT
Latest Stories