సెలబ్రిటీగా ఒకే మహిళతో ఉండడం అంటే కష్టం!

Usain Bolt Girl Bed Video, Usain Bolt Girl Bed Video Viral,  Usain Bolt Girl Bed Video Viral Comments, Usain Bolt Girl Bed Video Viral,Usain Bolt Controversyరియో ఒలింపిక్స్ తో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఆనందానికి అవధుల్లేవు. ఈ ఒలింపిక్సే తనకు చివరి ఒలింపిక్స్ అని ప్రకటించిన బోల్ట్, తాను అనుకున్న ట్రిపుల్ హ్యాట్రిక్ ను సాధించడంతో మరింత ఆనందంగా ఉన్నాడు. వీటన్నింటికీ తోడు తన 30వ పుట్టినరోజు జరుపుకున్న బోల్ట్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ లు చేశాడు. ముఖ్యంగా 20 ఏళ్ళ బ్రెజిల్ అమ్మాయి జాడీ డ్యురేట్ తో రాసలీలలు సాగించాడు. ఇందుకు సాక్ష్యం డ్యురేట్ తన వాట్సప్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఫోటోలే.

ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘బోల్ట్ ఎవరో తనకు తెలియదని, తన ఫ్రెండ్ చెప్పిన తర్వాతే అతను బోల్ట్ అని తెలిసిందని, వాట్సప్ లో షేర్ చేసిన తన ఫోటోలు వైరల్ కావడం తనకు చాలా సిగ్గుగా ఉందని…’ డ్యురేట్ తెలిపింది. ఇక, ఇదే అంశంపై బోల్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ADVERTISEMENT

ఒక సెలబ్రిటీగా ఒకే మహిళతో కలిసి ఉండటం చాలా కష్టమని, ఈ విషయాన్ని తాను చాలా తేలికగా తీసుకుంటున్నానని, జమైకా సంస్కృతి విభిన్నంగా ఉంటుందని, మహిళలతో పోలిస్తే పురుషులకు ఒకరి కంటే ఎక్కువ మంది భాగస్వాములుంటారని బోల్ట్ చెప్పుకొచ్చాడు. అలాగే, ఈ విషయమై బోల్ట్ సోదరి మాట్లాడుతూ, జమైకాకు చెందిన కాసి బెనెట్ తో బోల్ట్ డేటింగ్ చేస్తున్నాడని, రెండేళ్లుగా ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని, ఆ అమ్మాయినే తన సోదరుడు వివాహం చేసుకుంటాడని చెప్పింది.

ADVERTISEMENT
Latest Stories