వాలెంటైన్స్ డే స్పెషల్ సినిమా కబుర్లు.

Tillu Square

వాలెంటైన్స్ డే సందర్భంగా సినీ ప్రేక్షకులను అలరించడానికి మన తెలుగు హీరోలు ముందుకొచ్చారు. తమ కొత్త సినిమాల ట్రైలర్లతో, గ్లిమ్స్ తో, పోస్టర్లతో కొందరు వాలంటైన్ విషెస్ చెపితే బొమ్మరిల్లు సిద్దార్థ తన పాత సినిమా ఓయ్ ని రీరిలీజ్ చేసారు.

బాల నటిగా ఎంతో ఫ్రేమ్ తెచ్చుకున్న బాబు షామిలీ హీరోహిన్ గా నటించిన తొలి, చివరి సినిమా ఈ ఓయ్ కావడం విశేషం. అయితే షామిలీ, సిద్దార్థ నటించిన ఈ మూవీ మ్యూజికల్ గా హిట్ అయినా కమర్షిల్ గా అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో షామిలీ కి అనుకున్నంత గుర్తింపు పొందలేక పోయింది.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు ఒక్కో సందర్భాన్ని బట్టి పాత సినిమాలను రీరిలీజ్ చేసే ఆనవాయితీ రావడంతో ఓయ్ తో తన అభిమానులకు వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చారు సిద్దార్థ. అలాగే టిల్లు స్క్వేర్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి మర్చి 29 న థియేటర్లలోకి రానున్నారు సిద్దు జొన్నలగడ్ద , అనుపమ పరమేశ్వరన్. అయితే ఈ ఫెబ్ 14 కానుకగా తన సినిమా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు సిద్దు.

ట్రైలర్ చూస్తుంటే పోయిన సారికన్నా ఈసారి గట్టిగా కొట్టాలని టిల్లు ప్లాన్ చేసినట్టు ఉంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు అంటూ ఒక పోస్టర్ను విడుదల చేసింది. 365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం, అదే అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అంటూ 8 వసంతాల పోస్టర్ విడుదలయ్యింది.

అలాగే నాగ చైతన్య, హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి నటిస్తున్న తండేల్ మూవీ నుంచి కూడా వాలంటైన్స్ డే స్పెషల్ గా ఒక గ్లిమ్స్ వదిలింది చిత్ర యూనిట్. బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే., కాస్త నవ్వే అంటూ నాగ చైతన్య మాటలతో, సాయి పల్లవి నవ్వులతో సాగిన గ్లిమ్స్ ను విడుదల చేసారు. పనిలో పనిగా రవితేజ కూడా మిస్టర్ బచ్చన్ అంటూ తన మూవీ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ నటించబోతున్నారు. ఈ మూవీ కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.

ADVERTISEMENT
Latest Stories