వంశీ కం బ్యాక్ గ్లిమ్స్ వచ్చేసింది…కొడాలి ట్రైలర్ వదులుతారా.?

Vallabhaneni Vamsi and Kodali Nani in focus

గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీని ముఖ్యంగా చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అసెంబ్లీ నుంచి మీడియా వరకు ఉన్న ప్రతి ప్రచార సాధనాన్ని వినియోగించి కొడాలి, వల్లభనేని చేసిన విమర్శలు, ఆరోపణలు ఒకరకంగా వైసీపీ ని 151 నుంచి 11 కి తేవడానికి దోహదపడ్డాయనే చెప్పాలి.

అయితే వైసీపీ ఘోర ఓటమిలో తమ వంతు పాత్ర పోషించిన ఈ సోకాల్డ్ నేతలిద్దరు కూడా కూటమి అధికారంలోకి వచ్చాకా ఒక్కసారిగా తమ నోటికి తాళాలు వేసుకున్నారు. దానికి తోడు వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఆరోపణలతో అరెస్టయ్యి జైలుకెళ్లారు.

ADVERTISEMENT

ఇక గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనారోగ్య సమస్యలతో రాష్ట్ర సరిహద్దులు దాటారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో అటు వల్లభనేని వంశీ కానీ ఇటు కొడాలి నాని కానీ వైసీపీ కి మద్దతుగా కూటమి కి వ్యతిరేకంగా గళం విప్పిందే లేదు.

పేర్ని నాని, అంబటి రాంబాబు ఇద్దరు కూడా వైసీపీ కోసం చాల బలంగా తమ గళం విప్పుతున్నారు, జగన్ కు మద్దతుగా కూటమి పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల పై అవినీతి పై విచారణలు, అరెస్టులు అంటూ కూటమి ప్రభుత్వం లిక్కర్ కేసు, తిరుమల లడ్డు కల్తీ కేసు వంటి కేసులతో అనేకమంది వైసీపీ నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపింది.

ఆ సమయంలో కూడా వీరిద్దరూ వైసీపీ కి మద్దతుగా మీడియా ముందుకు రాలేకపోయారు. అటువంటి నేతలలో ఒకరైన వల్లభనేని వంశీ ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ముందు మీడియా ముందుకొచ్చి జగన్ కు మద్దతుగా ప్రకటనలు చేసారు. నన్ను అరెస్టు చేసిన వారిని అరెస్టు చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసుగా…ఆయనే నా వెనుకున్నారు, నన్నేవరు ఏమి పీకలేరు అంటూ వైసీపీ స్టయిల్ లో డైలాగ్స్ వదిలారు.

అయితే వల్లభనేని వంశీ ఇంత సుదీర్ఘ కాలం తరువాత ఇప్పుడు ఇలా బయటకొచ్చి జగన్ కు మద్దతుగా బాబు టార్గెట్ గా తనదైన స్టైల్ లో వదిలిన ఈ కంబ్యాక్ గ్లిమ్స్ చూస్తుంటే మరికొద్ది రోజులలో కొడాలి నాని కూడా తన స్టయిల్ లో ఒక బాబు టార్గెట్ గా ట్రైలర్ వదలనున్నారా అన్న చర్చ మొదలయ్యింది.

అయితే వంశీలో వచ్చిన ఈ మార్పు వైసీపీ గెలుపు మీద వచ్చిన ధీమానా.? లేదా రాజకీయాలలో తన ఉనికి కాపాడుకునే ప్రక్రియలో భాగమా.? లేక వంశీ యాక్షన్ కి టీడీపీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్నకు జవాబు కోసమా.?

ADVERTISEMENT
Latest Stories