సస్పెన్స్ కు తెరదించారు… ప్రిన్స్ ఫ్యాన్స్ కు షాక్..!

Vamsi Paidipally to direct mahesh babu 25th movieప్రిన్స్ మహేష్ బాబు నటించబోయే 25వ సినిమా ఎవరి దర్శకత్వంలో ఉండబోతోంది? అన్న విషయం పట్ల సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. బరిలో పూరీ జగన్నాధ్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్రమ్ కే కుమార్ వంటి చాలా పేర్లు వినిపించినప్పటికీ… తన కెరీర్ లో 25వ సినిమా కావడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపుకే ప్రిన్స్ మొగ్గుచూపుతారని అభిమానులు భావించారు.

ADVERTISEMENT

అయితే అభిమానులకు షాక్ ఇచ్చేలాంటి వార్తలు వెలువరించారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ట్విట్టర్ లో ప్రవేశించిన తర్వాత మొదట ట్వీట్ గా మహేష్ బాబు 25వ చిత్రం తన దర్శకత్వంలోనే రూపొందనుందని ప్రకటించారు. ఈ సినిమాను మెగా నిర్మాత అశ్వనీదత్ మరియు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజులు సంయుక్తంగా నిర్మించబోతున్నారని స్పష్టం చేసారు. ఈ ప్రకటనతో అవాక్కవ్వడం ప్రిన్స్ అభిమానుల వంతయ్యింది.

ఈ ఉదంతంతో ప్రిన్స్ వైఖరి స్పష్టంగా కనపడుతోంది. 24, 25 అనేవి కేవలం తన వరకు సంఖ్యలే తప్ప, తన దృష్టిలో పెద్దగా ప్రాధాన్యత లేదన్న విషయాన్ని మహేష్ బాబు చెప్పకనే చెప్పారు. అయితే ఎట్టకేలకు ప్రిన్స్ 25వ సినిమాపై స్పష్టత వచ్చింది. 23వ సినిమాగా మురుగదాస్, 24 కొరటాల, 25 వంశీ పైడిపల్లి ఫిక్స్ కావడంతో… ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ తో ఎప్పుడు సినిమా ఉంటుందా? అన్న ప్రిన్స్ ఫ్యాన్స్ ను వేధిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories