ట్రైలర్ టాక్ – రౌడీయిజంలో ‘క్లారిటీ’ మిస్సయ్యింది!

vangaveeti-movie-trailer-talkరాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం “వంగవీటి” ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. గతంలో విడుదల చేసిన టీజర్ కు కొనసాగింపుగా ఈ ట్రైలర్ నిలిచింది. విజయవాడ వాసులకు, రాజకీయ విజ్ఞులకు ‘వంగవీటి వర్సెస్ దేవినేని’ కధ గురించి తెలుసు కాబట్టి కాస్త అర్ధం కావచ్చు గానీ, మొత్తంగా ఈ కధలోని క్యారెక్టర్లను అర్ధం చేసుకోవాలంటే మాత్రం… ఈ ట్రైలర్ అంత అవకాశాన్ని ఇవ్వలేదని చెప్పవచ్చు.

ట్రైలర్ లో పరిచయమవుతున్న ఒక్కొక్క క్యారెక్టర్ చూపే లోపే మర్డర్ సన్నివేశాలు, స్కెచ్ వేసే సీన్లు వచ్చేసి ప్రేక్షకులను గందరోగోళంలో పడేసింది. అయితే 30 సంవత్సరాల చరిత్రను కేవలం 3 నిముషాల పరిధిలో కుదించడం కష్టమే గానీ, తన ప్రయత్నం అయితే వర్మ చేసినట్లుగా కనపడుతోంది. కాస్త కంఫ్యూజింగ్ ఉన్నప్పటికీ, వర్మ టేకింగ్, డైలాగ్స్ ట్రైలర్ ను ఆసక్తికరంగా మలిచాయి.

ADVERTISEMENT

అప్పటి రాధా నుండి మొదలైన ఈ ‘వంగవీటి’ చరిత్ర రంగాను హతమార్చే వరకు కొనసాగినట్లుగా కనపడుతోంది. వర్మ మనసుపెట్టి సినిమాలను తీస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు తెలిసిన విషయమే. మరి తన డ్రీం ప్రాజెక్ట్ గా చెప్పిన వర్మ, అంత మనసుపెట్టి సినిమాను తీసారో లేదో తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories