యువతకు భవిష్యత్‌ నిర్మించిన వ్యక్తి చంద్రబాబు! మరి జగన్?

Varla Ramaiahమొన్న అనంతపురంలో జగనన్న వసతి దీవెన సభలో సిఎం జగన్‌, టిడిపి అధినేతని ముసలివ్యక్తి అంటూ ఎద్దేవా చేయడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డి పుట్టుకతోనే వృద్ధుడు. ఆయన నడవడిక, ఆలోచనలు, మాటలు అన్నీ వెనుకబడిపోయిన్నట్లు ఉంటాయి. కనీసం వంగి కొబ్బరికాయ కొట్టలేక రాయినే పైకి ఎత్తిపట్టించుకొని కొట్టేవాడు యువకుడా వృద్దుడా?

చంద్రబాబు నాయుడు నేటికీ మండుటెండల్లో ప్రజల మద్య తిరుగుతుంటే, జగన్‌ పరదాలు కట్టించుకొని సకల సదుపాయాలు ఏర్పాటు చేసుకొని సభలు నిర్వహించుకొంటారు. మూడు దశాబ్ధాల ముందే చంద్రబాబు నాయుడు ఐ‌టి రంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి సంపద సృష్టించవచ్చని నిరూపించారు. కానీ మూడున్నరేళ్ళలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక్క ఐ‌టి కంపెనీని తీసుకురాలేకపోగా ఉన్నవాటిని తరిమేశారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్‌ తరాలకు దారి చూపిస్తే, జగన్‌ యువతకు భవిష్యత్‌ లేకుండా చేసేశారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొంటే హైదరాబాద్‌, సైబరాబాద్, హైటెక్ సిటీ, ఐ‌టి కంపెనీలు గుర్తుకు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డిని తలుచుకొంటే చంచల్‌గూడ జైలు, సైకో పాలన, సైకో వ్యవహారాలే గుర్తుకొస్తాయి. కనీసం చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన అమరావతి నిర్మాణ పనులను, 75-85% పూర్తయిన టిడ్కో ఇళ్లను కూడా జగన్ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. రాష్ట్రాన్ని అప్పులలో ముంచేస్తూ దివాళా తీయించేస్తున్న జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పేరు తలుచుకొనేందుకు కూడా అర్హత లేదు,” అని అన్నారు.

చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నగరానికి ఐ‌టి కంపెనీలు తీసుకువచ్చారని, వాటితోనే నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందని, అవే రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా నిలుస్తున్నాయని కేసీఆర్‌ తదితరులు బహిరంగంగా అంగీకరించనప్పటికీ వాస్తవం అదేనని వారికీ తెలుసు. కనుక వారు కూడా చంద్రబాబు నాయుడు చూపిన ఆ మార్గంలోనే ముందుకు దూసుకుపోతూ హైదరాబాద్‌ నగరాన్ని దేశంలోనే నంబర్: 1 స్థానంలో నిలుపుకొంటే, చంద్రబాబు నాయుడు వడ్డించిన విస్తరిలా అమరావతిని చేతికి అందిస్తే జగన్ ప్రభుత్వం దానిని కాలదన్నుకోవడాన్ని ఏమనుకోవాలి?

ఇది కేవలం పొరపాటయితే సరిదిద్దుకోవచ్చు కానీ మూడు రాజధానులనే తప్పుడు నిర్ణయాన్ని గుడ్డిగా పట్టుకొని వ్రేలాడుతుండటాన్ని ఏమనుకోవాలి?మన కళ్లెదుటే ఏపీ తెలంగాణ రాష్ట్రాలున్నాయి. పాలకుల ఆలోచనలు సరైనవైతే తెలంగాణలా అభివృద్ధి చెందుతుంది కాకుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలాగ మిగిలిపోతుందని చెపుతున్నాయిగా?

ADVERTISEMENT
Latest Stories