‘ఆ ఒక్కటీ అడక్కు…’ అన్న వరుణ్ తేజ్!

varun-tejగాయం కావడంతో ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మెగా హీరో వరుణ్ తేజ్, కాసేపు అభిమానులతో ముచ్చటించడానికి నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో జవాబులు చెప్పిన వరుణ్ తేజ్, ‘ఆ ఒక్క ప్రశ్నను మాత్రం అడగవద్దంటూ నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇంతకీ ఏంటంటారా..? ఇంకేముందిలేండి… మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని మలుపు తిప్పిన రాజకీయ రంగ ప్రవేశం.

ADVERTISEMENT

‘పాలిటిక్స్ లోకి వస్తారా?’ అని అడిగిన ప్రశ్నకు ‘డోంట్ ఆస్క్’ అంటూ మొహమాటం లేకుండా జవాబిచ్చారు మెగా ప్రిన్స్. అలాగే ఓ అభిమాని అడిగిన తుంటరి ప్రశ్నకు కూడా ఓపికగా రిప్లై ఇచ్చారు. ‘500 రూపాయలకు చిల్లర ఉందా?’ అని అడిగితే ‘ఉంది వచ్చి తీసుకో’ అంటూ చెప్పడం కొసమెరుపు. బహుశా వస్తే గనుక, ఆ అద్భుతమైన ప్రశ్న అడిగిన మనిషిని చూడవచ్చనే తాపత్రయం కావచ్చు గానీ, ఆ ప్రశ్నకు వరుణ్ జవాబు ఇవ్వడం హైలైట్.

హాలీవుడ్ అభిమాన నటుడు డికాప్రియో అని, బాలీవుడ్ లో షారుక్ ఖాన్ అని, మలయాళంలో మోహన్ లాల్ అని, క్రికెటర్లలో యువరాజ్, సెహ్వాగ్ ఎంతో ఇష్టమని, ఇష్టమైన ఆట వాలీబాల్ అని, యాక్షన్ సినిమాలంటే ఇష్టమని, అభిమానులే తనకు అతి పెద్ద అండ అని, మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే చరణ్ అన్నయ్యతో చేస్తానని, పవన్ కళ్యాణ్ నటించిన అన్ని సినిమాలలో ‘తమ్ముడు’ తనకు ఆల్ టైం ఫేవరేట్ అని అభిమానులతో పంచుకున్నారు వరుణ్.

ADVERTISEMENT
Latest Stories