ట్రైలర్ టాక్ – ‘రీల్ సీన్స్’తో కనెక్ట్ అయిన ‘రియల్ సీన్స్’

Venkatapuram Trailer Talkమహిళలపై జరుగుతున్న అకృత్యాలకు, అఘాయిత్యాలకు అంతం లేదన్న విషయం రోజూ వారీ వార్తలే చెప్తున్నాయి. నిర్భయ, అభయ లాంటి ఎన్ని పేర్లు తెరపైకి వచ్చినా, మహిళలపై లైంగిక దాడులు, సామూజిక మానభంగాలు తదితర కార్యక్రమాలన్నీ విజయవంతంగానే జరుగుతూనే ఉన్నాయి. చట్టం తన పని తానూ చేసుకుపోతూనే ఉంది. సరిగ్గా ఇలాంటి రియల్ సన్నివేశాలను క్రోడీకరించుకుని రీల్ పైకి ఒక సినిమా తయారయ్యింది. దాని పేరే “వెంకటాపురం.”

‘హ్యాపీ డేస్’ ఫేం రాహుల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా కధ అంతా ఒక అమ్మాయి హత్య గురించి తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎలా చంపబడింది? ఎవరి చేత చంపబడింది? ఎంత ఘోరంగా చంపారు? అనే విషయాలను సమీకరించుకుని తయారుచేసిన ఈ సినిమా ట్రైలర్ ను ఆసక్తికరంగా కట్ చేసారు. రోజూ ఒకటో, రెండో ఉదంతాలు నిజజీవితంలో వింటున్న, కంటున్న విషయాలే కావడంతో, ప్రేక్షకులు ఈ సినిమాకు వెంటనే కనెక్ట్ అవుతారు. అయితే ఎంత ఆసక్తికరంగా మలిచారనే దానిపైనే సినిమా విజయం దాగి ఉంటుంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories