వెన్నెల’ కిషోర్ కు కేటీఆర్ ప్రామిస్!

vennela-kishore-manikonda-roads-ktr-twitterకమెడియన్ గా తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్న వెన్నెల కిషోర్ కు, తెలంగాణా రాష్ట్ర మంత్రిగా ఉన్న కేటీఆర్ కు సంబంధం ఎక్కడ కలిసింది అనుకుంటున్నారా? వీరిద్దరిని కలిపింది మణికొండ రహదారి. అవును… వర్షం పడిన ప్రతిసారి తన నివాసానికి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతున్నానో… అంటూ చాలాసార్లు సోషల్ మీడియా ఖాతా వేదికగా వెన్నెల కిషోర్ తన ఆవేదనను వెలిబుచ్చిన విషయం నెటిజన్లకు తెలిసిందే. అదే ప్రాంతంలో ఉన్న పలువురు సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కూడా సదరు ట్వీట్లను సమర్ధిస్తూ వెన్నెల కిషోర్ తో పాటు ఆవేదనను వెలిబుచ్చారు.

అయితే తాజాగా ఇదే ఆవేదనను తనదైన స్టైల్లో మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ వేదికగా అడిగారు వెన్నెల కిషోర్. “మీకు ఇంతకంటే ఎక్కువ బాధ్యతలు, చేయాల్సిన పనులు ఉన్నాయని నాకు తెలుసు, అయినప్పటికీ అడుగుతున్నాను… మణికొండలో మంచి రహదారులు రావడానికి ఏమైనా అవకాశం ఉందా? సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాం” అంటూ వెన్నెల కిషోర్ ‘ఆస్క్ కేటీఆర్’ సెషన్ లో భాగంగా అడుగగా, వెంటనే కిషోర్ ట్వీట్ కు రాష్ట్ర మంత్రివర్యులు ప్రతిస్పందించారు.

ADVERTISEMENT

“ఖచ్చితంగా… ఇది నీకు మరియు అక్కడ నివాసం ఉంటున్న వారికి నా ప్రామిస్” అని కేటీఆర్ బదులివ్వడంతో, వెన్నెల కిషోర్ “దండాలు పెడుతూ” మళ్ళీ రిప్లై ఇచ్చారు. సినీ సెలబ్రిటీలను మచ్చిక చేసుకోవడంలో తెలంగాణా ప్రభుత్వం ఎక్కువ ఉత్సాహం చూపుతుందని మరోసారి ఈ ఘటనతో నిరూపణ అయ్యింది. ఏది ఏమైనా… మణికొండ రహదారుల అంశం కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా, రహదారుల నిర్మాణానికి కేటీఆర్ నుండి ప్రామిస్ కూడా తీసుకోవడంతో, స్థానిక వాసులు మాత్రం వెన్నెల కిషోర్ కు ఎప్పటికి రుణపడి ఉంటారేమో!

ADVERTISEMENT
Latest Stories