బావ కళ్ళలో ఆనందం కోసం.. ప్రచారం లో మాజీ హీరో!

Venu campaign for Nanm Nageswara Raoఖమ్మం జిల్లా రాజకీయాల్లో నామ నాగేశ్వర రావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. రేణుకా చౌదరి లాంటి బలమైన నాయకురాలిపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచిన సత్తా నామాకు ఉంది. అయితే ఈసారి ఖమ్మం అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు మన నామ నాగేశ్వర రావు. మహా కూటమి అభ్యర్ధిగా ఆయన ఈ సీటు నుంచి పోటీలో ఉండగా. ఆయనకోసం అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.

[m9ad]

ADVERTISEMENT

ఇదిలా ఉంటే తాజాగా అంటే గత మూడు నుంచి నాలుగు రోజులుగా ఖమ్మం జిల్లాలో ప్రముఖ మాజీ హీరో, నామాకి స్వయానా బావమరిది అయిన వేణు కూడా రంగంలోకి దిగి ప్రచారం చెయ్యడం విశేషంగా చెప్పవచ్చు. 2009లో కూడా వేణు నామ తరపున ప్రచారం చేశారు. అయితే ఈ సారి ఇటు మహాకూటమికి, అటు తెరాసకు నువ్వా-నేనా అన్నట్లుగా పరిస్థితులు ఉండడంతో అన్ని రకాలుగా సామ వేద దండోపాయాలు వాడేస్తున్నారు నాయకులు. అయితే ఇక్కడ చెపుకో దగ్గ విషయం ఏంటి అంటే, ఖమ్మంలో నామకి మంచి పేరు ఉండడం, మరో పక్క టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా బలమైన కేడర్ ఉండడం. ఇక స్వతహాగా నామా ప్రజల మనిషిగా అందరికీ దగ్గర కావడంతో ఈ సీట్ పై చాలా ఆశలే పెట్టుకుంది టీడీపీ. ఇక వీటన్నింటికీ తోడు సినీ గ్లామర్ వేణు కూడా తోడు కావడంతో నామ గెలుపు తధ్యంగానే కనిపిస్తుంది.

అయితే వేణు కూడా హీరోలా కాకుండా ఒక సామాన్యుడిలా, నామ చుట్టంగానే ఇంటింటికీ వెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి అన్న రిపోర్ట్ ను ప్రతీ సాయంత్రం నామా టీమ్ కి పంపించి నామ గెలుపే ఖమ్మం సమస్యలకు పరిష్కారంగా చెబుతూ ఆయన అందరికీ నామ అండగా ఉంటారు అని చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే బావ కళ్ళల్లో ఆనందం కోసం, బావ గెలుపు కోసం ఈ మాజీ హీరో, ఇంటింటికీ తిరిగి ప్రచారం చెయ్యడం విశేషంగా చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories