టీవీకే – కాంగ్రెస్: జగన్ ప్లేస్ లోకి షర్మిల.?

Vijay and Y. S. Jagan Mohan Reddy during discussions around the TVK-Congress political alliance debate

పక్కంటిటోడి పెళ్ళికి మన ఇంట్లో హడావుడి అన్నట్టుగా తమిళ రాజకీయాలలో విజయ్ టీవీకే విజయం పై ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హంగామా ఎక్కువయ్యిందనే చెప్పాలి. విజయ్ ఎన్నికలలో సింగల్ గా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే 108 స్థానాలలో విజయం సాధించడంతో ఇక విజయ్ టీవీకే విజయం లో క్రెడిట్ చోరీకి సిద్దమయ్యింది వైసీపీ.

దానికి తోడు విజయ్ తన ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫోటోను పట్టుకోవడంతో ఇక వైసీపీ, టీవీకే గెలుపులో జగన్ పాత్ర అంటూ జగన్ కు సింహం ఎలివేషన్లు మొదలుపెట్టింది. కట్ చేస్తే, తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయిలో విజయ్ టీవీకే 118 మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయింది.

ADVERTISEMENT

దీనితో విజయ్ కాంగ్రెస్ తో సహా ఇతర చోటామోటా పార్టీలతో రాజకీయ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక ఆ దిశగా కాంగ్రెస్ కూడా డీఎంకే తో ఉన్న ఎన్నికల పొత్తును తెగతెంపులు చేసుకుని విజయ్ టీవీకే కి అధికారికంగా మద్దతు ప్రకటించింది.

దీనితో ఇన్నాళ్లు సింహం సింగల్ అంటూ విజయ్ టీవీకే పార్టీని జగన్ వైసీపీ ని సరిపోల్చిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు టీవీకే – కాంగ్రెస్ పొత్తుకు మద్దతు పలికినట్టేనా.? గత నాలుగు రోజులుగా విజయ్ ని వైఎస్ జగన్ తో సరిపోల్చిన వైసీపీ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ తో విజయ్ పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో వైఎస్ షర్మిలతో పోల్చగలరా.?

కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ను స్థాపించిన వైఎస్ జగన్ ఇప్పుడు ఆ కాంగ్రెస్ అధిష్టానం మద్దతు తో తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న విజయ్ కు మద్దతు పలుకగలదా.? అలాగే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీవీకే పార్టీతో జగన్ ను పోల్చుకోగలదా.?

నిన్నటి వరకు జగన్ తో విజయ్ అన్నట్టుగా సాగిన ఏపీ రాజకీయాలు ఇప్పుడు టీవీకే – కాంగ్రెస్ పొత్తుతో షర్మిల తో విజయ్ అన్నట్టుగా మారిపోతున్నాయా.? కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ముందు వరకు విజయ్ మా వాడని, విజయ్ టీవీకే గెలుపు మా గెలుపని జబ్బలు చరుచుకున్న వైసీపీ కి విజయ్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఊహించని షాక్ ఇచ్చారు. దీనితో నిన్నటి వరకు విజయ్ పక్కనున్న జగన్ స్థానంలోకి ఇప్పుడు ఆయన చెల్లి షర్మిల వచ్చి చేరినట్టయ్యింది.

మరి ఇప్పుడు కూడా వైసీపీ శ్రేణులు వీధిలో పెళ్ళికి ఇంట్లో సంబరాలు చేసుకుంటారా.? లేదా సైలెంట్ గా పక్కకు జారుకుంటారా.?

ADVERTISEMENT
Latest Stories