సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మైక్ పట్టుకున్నారంటే, ఆ రోజు వార్తల్లో ఆయన తప్ప మరొకరు ఉండడానికి ఛాన్స్ ఇవ్వరు. అంతలా ప్రేక్షకులను, మీడియాను ఆకర్షించేస్తారు ఈ యంగ్ హీరో. మరి తన సినిమాలకు తప్ప, ఇతర హీరోల సినిమాలకు హాజరు కాని విజయ్, తొలిసారిగా “సవ్యసాచి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు.
[m9ad]
ఈ రోజు హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుకలో విజయ్ దేవరకొండనే స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారు. విజయ్ తో పాటు ప్రముఖ దర్శకులు కొరటాల శివ, సుకుమార్ లు కూడా “సవ్యసాచి” వేడుకలో భాగస్వామ్యులు కాబోతున్నారు. దీనికి సంబంధించి అధికారిక వార్త వెలువడింది. బహుశా ఈ సమాచారం ముందే తెలిసి ఉంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా హంగామా చేసేవారేమో!
‘కార్తీకేయ, ప్రేమమ్’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నాగచైతన్యకు జతగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఓ ముఖ్యమైన పాత్రలో హీరో మాధవన్ కనిపించనున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఎంఎం కీరవాణి అందించిన చిత్ర ఆల్బమ్ సంగీత ప్రియులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.



