తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్, ఆయన భార్య సంగీత మధ్య నెలలుగా కొనసాగుతున్న విడాకుల వ్యవహారంలో ఊహించని మలుపు తిరిగింది.
సంగీత విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఆమె విడాకులు కోరుతూ కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేయడం అప్పట్లో చాలా సంచలనంగా మారింది. ఈ కేసు పలుమార్లు వాయిదా పడిన తర్వాత నేడు (ఆగస్టు 7) తదుపరి విచారణ జరగాల్సి ఉంది. కానీ విచారణకు ముందే ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు సమాచారం.
దీంతో వారిరువురూ రాజీ పడ్డారా లేక భర్త ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నందున మళ్ళీ ఆయనతో కలిసి కాపురం చేయాలనుకుంటున్నారా?అనే చర్చ మొదలైంది.
విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య స్వయంగా విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత సిఎం విజయ్, త్రిషతో కలిసి ఓ కోలీవుడ్ నిర్మాత కొడుకు పెళ్ళికి హాజరయ్యి ఆశీర్వదించి వచ్చారు. తద్వారా తమ మధ్య బంధాన్ని బహిర్గతం చేసి దానిని కొనసాగించబోతున్నట్లు సంకేతం ఇచ్చినట్లయింది.
ఇప్పుడు సంగీత విడాకులు పిటిషన్ వెనక్కు తీసుకోవడంతో విజయ్ భార్యతో రాజీ పడేందుకు అంగీకరించారా లేదా అంగీకరిస్తారా? ఒకవేళ విజయ్, సంగీత రాజీ పడితే త్రిష పరిస్థితి ఏమిటి? ఆమె అజ్ఞాత ప్రేయసిగానే ఉండిపోతారా? అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెపుతుంది.



