ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల మనవడు, నటుడు నరేష్ తనయుడు నవీన్ “నందిని నర్సింగ్ హోం” సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం కానున్న విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. మీడియా ఛానల్స్ లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇస్తున్న నరేష్ – విజయనిర్మల – నవీన్ ల మధ్య ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
చిత్ర విశేషాలను తెలియజేసే క్రమంలో యాంకర్ అడిగిన పలు ప్రశ్నలలో… ఇద్దరు హీరోయిన్లు మీకు ఎలా సహకారం అందించారో చెప్పాల్సిందిగా హీరో నవీన్ ను కోరగా, ఇంతలో నరేష్ కల్పించుకుని ‘ఏది ఆన్ స్క్రీనా? ఆఫ్ స్క్రీనా?’ అంటూ పంచ్ వేసే ప్రయత్నం చేసాడు. అయితే పక్కనే ఉన్న విజయనిర్మల వెంటనే… ‘ఏయ్’ అంటూ నరేష్ ను కసురుకున్నారు. ఇంతలో నవీన్ ‘అలాక్కూడా ఉంటుందా డాడీ’ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేయగా, ‘నువ్వు సైలెంట్ కిల్లర్ వి రా’ అంటూ తనయుడ్ని గురించి నరేష్ అన్నారు.
అయితే ఇద్దరు హీరోయిన్లు తన మాదిరే కలివిడిగా మాట్లాడతారని, ఇద్దరికీ మంచి పాత్రలు లభించాయని, శ్రావ్య పాత్రలో షేడ్స్ ఉన్నాయని, మీరు తెరపైన చూస్తారని హీరో నవీన్ చెప్తుండగా, ‘వాడి హీరోయిన్ల గురించి వాడే చెప్పుకుంటున్నాడు, అక్కడ బయటపడింది అసలు విషయం ఏంటో’ అని మళ్ళీ నరేష్ కామెంట్ చేసారు. అయితే హీరోయిన్లపై నరేష్ ఇంతలా మాట్లాడడం అతని వయసుకు తగినది కాదని, ముఖ్యంగా ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి, ఈ విధంగా మీడియాలలో వ్యాఖ్యానించడం హుందాతనంగా ఉండదన్న కామెంట్స్ చేస్తున్నారు. బహుశా ఇదంతా పబ్లిసిటీ మాయేమో..!



