తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తిగానే సాగుతాయి. అయితే డీఎంకే లేకుంటే అన్నాడీఎంకే అన్నట్టుగా ఈ రెండు పార్టీల మధ్యనే దశాబ్దాలుగా తమిళరాజకీయాలు నలిగిపోతున్నాయి. ఆ రెండు పార్టీలకు మూడో ప్రత్యామ్నాయంగా తమిళ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావించిన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లను తమిళ ప్రజలు స్వాగించడం లేదు.
దీనితో ఇక తమిళనాడులో మూడో ప్రత్యామ్నాయం కష్టమే అనుకున్న తరుణంలో తమిళనాడు ప్రజల ఆరాధ్య దైవంగా భావించే సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటన తమిళ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. ఇక తలైవా పాలిటిక్స్ లో అడుగుపెట్టబోతున్నారని తెలిసి ఆయన ఫ్యాన్స్ పూనకాలతో ఉగిపోయారంటే అతిశయోక్తి కాదేమో.
2020 డిసెంబర్ 3 న తన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించిన రజనీ 2021 జనవరి న ‘మక్కల్ సేవై కచ్చి’ అంటూ తన రాజకీయ పార్టీ పేరు ప్రకటించారు. అభిమానులతో మీటింగ్లు, పొలిటికల్ ప్రయాణం పై చర్చలు అన్ని సాగుతున్న తరుణంలో ఒకనాడు ఆరోగ్య సమస్యల కారణంగా తానూ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా అంటూ ప్రకటించాయి రజనీ తన అభిమానులకే కాదు యావత్ తమిళ ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చారు.
దీనితో డీఎంకే – అన్నాడీఎంకే పార్టీలకు ప్రతిగా వస్తుందనుకున్న రజని MSK మూడో ప్రత్యామ్నాయం ఎన్నికల బరిలోకి దిగకుండానే అస్త్ర సన్యాసం చేసినట్టయ్యింది. ఇక రజని స్థాయిలోనే తమిళనాడులో ఫ్యాన్ బేస్ ఉన్న విశ్వ నటుడిగా ప్రశంసలు దక్కించుకున్న కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం పార్టీ పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
ఆయన రాజకీయ ప్రయాణం కూడా ఓటమితోనే ఆరంభం అయ్యింది. 2019 లోక్ సభ ఎన్నికలలో కోయంబత్తూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కమల్ కు తొలి ప్రయత్నంలో ఓటమి పలకరించింది. దానితో పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు కమల్. ఇక ఆ తరువాత DMK పార్టీతో పొత్తు పెట్టుకుని రాజ్యసభ ఎంపీ గా పార్లమెంట్ లో అడుగుపెట్టారు.
ఇలా తమిళనాట అగ్ర నటులుగా ప్రేక్షకుల చేత ఆరాధింపబడ్డ ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ రెండు కూడా అట్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఒకరు అస్త్ర సన్యాసంతో వెనుతిరిగితే మరొకరు అస్త్రాలు అంసందింకెహ్లేక ఎంపీ పదవితో సరిపెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో DMK, ఐడ్మ్కరెండు పార్టీల రాజకీయ ఊభిని చీల్చుకుంటూ ఆ మూడో ప్రత్యామ్నాయంగా విజయ్ TVK పార్టీతో తమిళ రాజకీయాలలోకి అడుగుపెట్టారు. 2024 ఫిబ్రవరి 2 న విజయ్ “తమిళాగ వీరన్ కచ్చి” పేరుతో తమిళ రాజకీయాలలోకి అడుగుపెట్టారు.
చివరికి 2026 ఎన్నికలలో తాను అనుకున్న ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోబోతున్నారు. దీనితో రజని అందుకోలేనిది, కమల్ సాధించలేనిది విజయ్ సాధించి చూపించారు అంటూ విజయ అభిమానులు TVK విజయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.




