విజయ్ ఆత్మహత్య కేసులో తొలి అరెస్ట్?

Vijay Sai accused wife of harassment in selfie videoహాస్యనటుడు విజయసాయి ఆత్మహత్య కేసులో అతని భార్య వనిత అరెస్ట్ కు పోలీసులు సిద్ధమవుతున్నారు. తన చావుకు భార్య వనితతో పాటు మరో ఇద్దరు కారణమంటూ విజయ్ సాయి ఉరేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిని మరణ వాంగ్మూలంగా చేసుకుని వనితను అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.

విజయ్ సాయి ఆత్మహత్య రోజు కనిపించిన వనిత, ఆ తర్వాత నుంచి అందుబాటులో లేకుండా పోవడం, వనితపై మరిన్ని సందేహాలు తలెత్తేలా చేస్తోంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వనిత ఎక్కుడున్నదీ పోలీసులు గుర్తించారు. విజయ్ సాయి ఆత్మహత్యకు తాను కారణం కాదని వనిత పేర్కొన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

అయితే, ఆత్మహత్యకు ముందు రోజు వనిత తన కారును బలవంతంగా తీసుకెళ్లిందని పోలీసులకు విజయ్ సాయి ఫిర్యాదు చేసిన విషయం గమనార్హం. దీంతో అసలు కారును బలవంతంగా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, తదితర కోణాలను విచారణలో వనిత నుంచి రాబట్టాలని పోలీసులు అనుుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories