నేడు మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల సందర్భంగా ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీలు తాజా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. అయితే ఇందులో పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాల పై దేశ వ్యాప్తంగా ద్రుష్టి సారించారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు లో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ తో తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అటు బీజేపీ డిమేంకే కూటమితో పొత్తు వద్దనుకుని విజయ్ TVK ఒంటరి పోరుకు సై అంటూ బరిలోకి దిగడంతో విజయ్ గేమ్ చెంజర్ కానున్నారా లేదా పొలిటికల్ గేమ్ లో బలవుతారా అన్న చర్చ సాగింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మొదలైన బ్యాలట్ కౌంటింగ్ లో విజయ్ TVK అనూహ్యంగా స్టాలిన్ DMK ను అధిగమించి 71 సీట్లతో ముందంజలో కొనసాగుతుంది. DMK 48, అన్నా DMK +బీజేపీ …39, TVK …71 తో విజయ్ దశాబ్దాల రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టగలిగారు.
దీనితో యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే నిజం కాబోతుందా.? విజయ్ టీవీకేపార్టీ అధికార పీఠం దక్కించుకోనుందా.? అన్న చర్చ మొదలయ్యింది. అలాగే తమిళనాడులో పెరిగిన ఓటింగ్ పర్శంటేజ్ మొత్తం విజయ్ TVK పార్టీ కి అనుకుఅలంగా మారింది అనుకోవాల్సిందే. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే విజయ్ మరో ఎన్టీఆర్, మరో MGR కావడం ఖాయంగా కనిపిస్తుంది.




