
జగన్ అక్రమాస్తుల కేసులో A2 గా, వైసీపీ పార్టీలో నెంబర్ 2 గా కొనసాగిన విజయ సాయి రెడ్డి అనూహ్యంగా ఎవరి ఊహకు అందని రీతిలో వైసీపీ పార్టీకి, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే ఇక రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించి వైసీపీ అధినేత జగన్ కే కాదు కూటమి నేతలకు కూడా షాక్ ఇచ్చారు విజయసాయి. 2024 ఎన్నికల ఓటమితో కంగుతిన్న వైసీపీ ముఖ్య నేతలు, వైస్ కుటుంబ వీర విధేయులు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పడం వెనుక దాగిఉన్న ఆ జగన్ ప్యాలస్ రహస్యాలు ఎప్పటికి బయటకొస్తాయో ఎవరికెరుకా.
Also Read – వైసీపీకి టీడీపీ పెర్‌ఫెక్ట్ సమాధానాలు… బావున్నాయి!
అయితే విజయసాయి రెడ్డి తన స్వీయ నిర్ణయం మేరకే తన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందని, ఇందులో ఎటువంటి ఒత్తిడులు లేవంటూ పేర్కొన్నారు. అలాగే తనకు బాబు కుటుంబంతో కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ తో కానీ ఎటువంటి వ్యక్తిగత శత్రుత్వం లేదంటూ తెలియచేసారు.
అలాగే తనకు ఇన్నాళ్లు రాజకీయ అవకాశం కల్పించిన జగన్ కు వైస్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియచేసారు. అయితే జగన్ లండన్ పర్యటనలో ఉండగానే విజయ సాయి ఇంత సడెన్ గా తన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక దాగి ఉన్నఆ వ్యూహం ఏమిటో.?
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
నిజంగా తానూ రాజకీయాల నుండి తప్పుకోవాలి అనుకుంటే జగన్ ఏపీకి తిరిగి వచ్చాక అతనితో చర్చించి ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. కానీ సాయి రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఎవ్వరు ఊహించని సందర్భంలో రాజకీయాల నుండి తప్పుకుంటున్నా అంటూ ప్రకటించడం అంటే బ్యాక్ గ్రౌండ్ లో చాల పెద్ద కథే నడుస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
2024 ఎన్నికల సమయం నుండే జగన్ కు సాయి కి మధ్య అభిప్రాయం బేధాలు వచ్చాయని, తానూ కోరిన విశాఖ సీటు కాకుండా జగన్ తనను నెల్లూరు కి పంపడం పై కూడా సాయి రెడ్డి అసంతృత్తి వ్యక్తం చేసినట్లు అప్పట్లో పార్టీలో గుసగుసలు వినపడ్డాయి. దానికి తోడు పార్టీ ఘోర ఓటమి, విజయ సాయి చుట్టూ వ్యక్తిగత వివాదాలు జగన్ కు సాయి పై మరింత ఆగ్రహాన్ని తెప్పించినట్టు సమాచారం.
Also Read – తెలంగాణలో మొదలైన ‘రిజర్వేషన్ల’ లొల్లి..!
ఇక దానికి తోడు కాకినాడ పోర్ట్ వివాదంలో విజయ సాయి పేరు బయటకు రావడం, ఇక 2019 నుండి 2024 వరకు సాగిన వైసీపీ అవినీతి గుట్టు ఒక్కొక్కటిగా రట్టు అవడం సాయి రిటైర్మెంట్ కు కారణం కానుందా.? లేక ఎవరినైనా తన అవసరానికి అడ్డపెట్టుకోవడం ఇక అటు పిమ్మట అడ్డుతొలగించుకోవడం జగన్ కు వెన్నతో పెట్టిన విధ్యే కావడంతో విజయ సాయిని కూడా తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల మాదిరి రాజకీయాల నుండి జగన్ తప్పించారా.? లేక తప్పుకోమని ఆదేశించారా.? అనేది రానున్న రోజులలో తెలుస్తుంది.
అయితే విజయ సాయి రెడ్డి రాజకీయ రిటైర్మెంట్ తో ఆయన మీద ఉన్న కేసులన్నీ ఏ దరికి చేరుకుంటాయి. అలాగే గత కోనేళ్ళుగా జగన్ అండ చూసుకుని టీడీపీ, జనసేన పార్టీ నేతల మీద, ఆ పార్టీల అధినేతల మీద సాయి చేసిన వెటకారాలకు, వెక్కిరింపులకు రిటైర్మెంట్ తో రాజీ చెప్పినట్టేనా.!
మొన్న కోమటి రెడ్డి, నిన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, నేడు విజయసాయి రెడ్డి ఇలా జగన్ సామజిక వర్గ నేతలే, వైస్ కుటుంబ సన్నిహితులే జగన్ ను తట్టుకోలేక పార్టీని వీడుతున్నారంటే ఇక ఈ కోవలో భవిష్యత్ లో మరి ఇంకెంతమంది వైసీపీ నేతలు రాజీనామాలతో ‘క్యూ’ కట్టనున్నారో కాలమే సమాధానం చెప్పాలి.