ఆంధ్రప్రదేశ్ పోలీసుల స్వామి భక్తికి జోహార్లు

Gautam-Sawang - Vijayasai-Reddyదేశవ్యాప్తంగా 40 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో సామజిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. పోలీసులకు సెలవులు రద్దు చేసి లాక్ డౌన్ పర్ఫెక్ట్ గా అమలు చేసే పరిస్థితి అన్ని రాష్ట్రాలలో ఉంది. కొన్ని చోట్ల పోలీసులు కూడా కరోనా భారిన పడటం మనం చూశాం. ఈ క్రమంలో పోలీసుల మీద ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తగా వారి పని భారాన్ని సమీక్షించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రభుత్వం పోలీసులను రాజకీయ అవసరాలకే ఉపయోగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ లేఖ మూలాలపై సీఐడీ దర్యాప్తు చేస్తుంది. ఈ లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచే పంపించారని, సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ… లేఖ మూలాలు కనుగొనాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేయడంతో సీఐడీ రంగంలోకి దిగింది.

ADVERTISEMENT

ప్రభుత్వంలో నెంబర్ టూ అయిన విజయసాయి రెడ్డి కంప్లయింట్ తో ఇంకో పనే లేదు అన్నట్టు… ఒక టీం గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసింది. ఇప్పటికే నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్ సాంబమూర్తిని ఏపీ సీఐడీ విచారించింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో మరోసారి సాంబమూర్తిని విచారిస్తున్నారు.

లాక్ డౌన్ సమయంలో కూడా కక్షసాధింపులకే పెద్ద పీట వేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎలాగైనా ఆ లేఖకు టీడీపీకి లింకు చేసేస్తే… హైకోర్టులో ఆ కథ ముగించేయ్యవచ్చని ప్రభుత్వం ఆలోచన. స్వామి భక్తితో పోలీసులు సైతం సమయం సందర్భం లేకుండా రాష్ట్రాలు దాటి వెళ్లి విచారణ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories