విజయవాడ ‘బెస్ట్ ప్రైస్’లో భారీ అగ్ని ప్రమాదం!

vijayawada-best-price-fire-accidentఆంధ్రప్రదేశ్ లోనే ఒక భారీ మాల్ గా ఉన్న విజయవాడ సమీపంలో ఉన్న నిడమనూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ తెల్లవారుజామున బెస్ట్‌ ప్రైస్ సూపర్ మార్కెట్లో మంటలు చెలరేగాయి. మంటలు మార్కెట్ మొత్తం వ్యాపించడంతో అందులోని సరుకులు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒకరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ADVERTISEMENT

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండడంతో అదుపులోకి తేవడం కష్టతరంగా మారింది. మాల్ నుంచి పేలుడు శబ్దాలు వినిపిస్తుండడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. విజయవాడలో ఇంత పెద్ద అగ్నిప్రమాదం జరగడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ఈ ఘటనలో కోట్లాది రూపాయల నష్టం వాటిలినట్టు అంచనాలు వేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories