ఎవరు ఊహించని రీతిలో విజయవాడలో వర్షాలు సృష్టించిన వరద బీభత్సం అటు ప్రభుత్వాలతో పాటు ఇటు సాధారణ ప్రజలకు కూడా కనువిప్పు చేశాయని చెప్పాలి. నదులను, చెరువులను అక్రమంగా ఆక్రమించి లే ఔట్లు వేసి ఇళ్ల నిర్మాణాలను ఎదేచ్చగా కొనసాగిస్తున్నారు కబ్జా దారులు.
Also Read – అతితెలివి ప్రదర్శించినా జగన్ దొరికిపోయారుగా!
ఇప్పుడు విజయవాడలో ఏర్పడిన ఈ జలవిలయానికి కారణం ఇదేఅంటూ బుడమేరు ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అటు హైద్రాబాద్ లోను ఇదే పరిస్థితి ఎదురుకావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాతో దూకుడు పెంచి అక్రమ ఆక్రమణల నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది.
రాష్ట్ర విభజనతో విజయవాడ నగరం విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బుడమేరు ప్రవాహాన్ని అడ్డుకట్ట వేస్తూ విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టారు. దీనితో బుడమేరు ప్రవాహ వేగం ఇళ్ల నిర్మాణం పై పడి సింగినగర్ వంటి ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ అక్రమ నిర్మాణాల పాపం ప్రభుత్వాలదా? రాజకీయ నాయకులదా.? అధికారులదా.? లేక వ్యవస్థలను నమ్మి కొనుగోలు చేస్తున్న సాధారణ పౌరులదా.?
Also Read – బెంగుళూరు ప్యాలస్‌లో అపరిచితుడు
విజయవాడ వరద బీభత్సం సాధారణ పరిస్థితికి చేరుకున్న తరువాత వెంటనే బుడమేరు కబ్జాల లెక్క బయటకు తీసి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.తెలంగాణలో ఉన్న హైడ్రా మాదిరి వ్యవస్థను సృష్టించి ఈ అక్రమాల అంతు చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పై పడింది.
అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నది ప్రవాహ ప్రాంతాలలో కనీసం పూడిక కూడా తీయకపోవడం ఈ ప్రళయానికి మరోకారణం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన అనుచరుల చేత బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదురవుతున్నాయి.
Also Read – సెప్టెంబర్-14 వీరిద్దరికి సమ్ థింగ్ స్పెషల్..!
కూటమి ప్రభుత్వం అలసత్వం వహించకుండా ఇటువంటి ఆరోపణల పై విచారణ జరిపి అక్రమార్కులకు చట్టపరంగా శిక్షలు విధించాలి, అలాగే బాధితులకు న్యాయం చేసి ఆక్రమణలను తొలగించాలి. అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఉచిత ఇళ్లకు అంటూ, జగనన్న కాలనీలు అంటూ ఇటువంటి వరద ప్రభావిత ప్రాంతాలలో నిర్మాణాలను చేపట్టడం కూడా ఈ విలయాలను నిలయంగా మారుతున్నాయి.