వైసీపీ ముఖ్య నేతలలో ఒకరైన విజయ సాయి రెడ్డి పార్టీలోనే కాదు జగన్ అక్రమ కేసులలో కూడా ముఖ్య నిందితుడిగా గడిచిన పదేళ్ల నుండి బెయిలు మీద ఉండి ఏపీలో రాజకీయాలు కొనసాగిస్తున్నారు.అయితే ఈయన గారు ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేయరు అలాగే ప్రత్యేక్షంగా కూడా ప్రత్యర్థుల పై విమర్శలు చేయలేరు. ఏదైనా బ్యాక్ డోర్ పొలటిక్స్ మాదిరే. రాజ్య సభ ద్వారా ఎన్నికై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంటారు విజయ సాయి రెడ్డి.
చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టయిన కొంత కాలం నుండి ఈయనగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురందరేశ్వరిని టార్గెట్ చేస్తూ తన X మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో దోస్తీ చేస్తూ రాష్ట్ర నాయకత్వంపై కుస్తీ పట్లు పడుతున్నారు ఈ రెడ్డి. అయితే తాజాగా మరోసారి పురంధరేశ్వరిని టార్గెట్ చేస్తూ కారంచేడు 145 వ పోలింగ్ బూత్ లో బీజేపీకి పడిన 6 ఓట్లలో అసలు పురందరేశ్వరి గారి ఓటు ఉందా?
సొంత పార్టీ అభ్యర్థికే అధ్యక్షురాలు ఓటు వేయలేదా? నా ఓటు రాజంపేటలోనే ఉండిపోయిందని బొంకుతారా? మీ బావ పక్షాన పక్షపాతివై ఏపీ అభివృద్ధి కంటగింపు అయిపోయిందా? అంటూ వెటకారంగా చాలా ప్రశ్నలే వదిలారు పురందరేశ్వరికి. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియా వేదికగా విజయసాయి రెడ్డికి కూడా కొన్ని ప్రశ్నలను సంధించారు నెటిజన్లు.
లిక్కర్ స్కాములో ఈడీ విచారణలో దొరికిపోతాము అనే భయంతో నా ఫోన్ పోయింది అంటూ కంప్లైన్ట్ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఆ ఫోన్ ఎందుకు దొరకలేదు? దాని పై విచారణ ఎక్కడి వరకు వచ్చింది?అసలు ఫోన్ పోయిందా? పోగొట్టరా? ఫోన్ పై విచారణ జరుపుతున్న అధికారులను నా ఫోన్ ఎక్కడా అంటూ ఏనాడైనా ప్రశ్నించారా? పక్క పార్టీలకు పడ్డ ఓట్లమీద తరువాత ఆరా తీయొచ్చు కానీ ముందు పోయిన తమరి ఫోన్ గురించి కాస్త ద్యాస పెట్టండి తమ్ముడు అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున విజయ సాయికి ఎదురు ప్రశ్నలు మొదలైనాయి.
నేను నోరిప్పితే పురందరేశ్వరి ఏం చేసుకుంటుందో అని తెగ బాధపడిపోయిన విజయసాయి ఒక్కసారి పోయిన ఆయన ఫోన్ దొరికిన, ఆయనకు వచ్చిన బెయిలు రద్దైన చేసుకోవడానికి, చూసుకోవడానికి, ఇలా వెటకారాలు చేయడానికి ఇంకేం మిగలదు అనే సత్యాన్ని ఎప్పటికి గ్రహిస్తారో మరి!




