Vijaysai Reddy Purandeswari

ఏపీలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపి, వచ్చే ఎన్నికలలో 175కి 175 సీట్లు మేమే గెలుచుకొంటామని చెప్పుకొంటోంది. కనుక టిడిపి, జనసేన, బీజేపీలను కూడా వైసీపి పట్టించుకోనవసరం లేదు.

దేనితో ఏది పొత్తులు పెట్టుకొన్నా ‘సింగిల్ సింహానికి’ భయం లేదని చెప్పుకొంటున్నారు కనుక వాటి పొత్తుల గురించి ఆలోచిస్తూ మిగిలిన కొద్దిపాటి పుణ్యకాలాన్ని వేస్ట్ చేసుకోనవసరం లేదు. ఆంధ్రాలో 97శాతం ప్రజలకు మేలు చేసేశారు కనుక బస్సులు వేసుకొని సాధికార యాత్రలు చేయవలసిన అవసరమే లేదు కదా?

Also Read – అమరావతి గురించి చింతించలేదు కాని ప్యాలస్‌ ముఖ్యమా?

కానీ తెల్లారి లేచింది మొదలు అర్దరాత్రి వరకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ గురించి ఆలోచనలే. వారిని కేసులతో లోపలేసేయాలనే ఆలోచనలే? ఏ వంకతో అవహేళన చేయాలనే తాపత్రయమే. ఇది అహంభావమా… అభద్రతాభావమా?

ఇప్పుడు ఆ జాబితాలో దగ్గుబాటి పురందేశ్వరిని కూడా చేర్చుకొని నిత్యం ఆమె గురించి కూడా ఆలోచిస్తూ వైసీపి నేతలు బీపీ పెంచుకొంటున్నారు.

Also Read – మేమూ డైరీలు రాసుకుంటున్నామోచ్!

ఆమె పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచే వైసీపి ఎంపీ విజయ సాయిరెడ్డి పాట మొదలుపెట్టేశారు. ఇప్పుడు వైసీపికి పక్క తాళాలు వాయించేవారు కూడా ‘పార్టీ ఇచ్చిన లైన్ ప్రకారం’ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. అవహేళన చేస్తున్నారు.

ఇక విజయ సాయిరెడ్డి అయితే మరిచిపోకుండా ప్రతీరోజు ఆమెకు ట్విట్టర్‌లో ఓ గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడుతుంటారు. ఈరోజు ఏమి పెట్టారంటే, “చంద్రబాబుకు అనారోగ్యం – బెయిల్ షరతులు సరే– పార్టీలో లోకేష్ – భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు? ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా! తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా? లేక టీడీపీ భారమంతా పురంధేశ్వరిపైనే పెట్టారా? ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావచ్చేమో కానీ బావగారి పార్టీ టీడీపీని బతికించడంలో కాదు సుమా!”

Also Read – స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్..!

తెలంగాణలో టిడిపి జెండా పీకేసిందో లేక ఎన్నికలలో పోటీ చేయకుండా ఎందుకు వెనక్కు తగ్గిందో, ఏపీ ఎన్నికలలో దాని పర్యవసానాలు ఏవిదంగా ఉండబోతున్నాయో అందరి కంటే బాగా విజయ సాయిరెడ్డికే బాగా తెలుసు. కనుక ఏపీలో ఎన్నికలొస్తే ఎలాగూ ఆయన ఆరాటం తీరిపోతుంది.

నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చేస్తునన్ని రోజులు విజయ సాయిరెడ్డి ఒక్క ముక్క మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నారా లోకేష్‌ ఎక్కడా అని అడుగుతున్నారు!ఎక్కడా అని అడిగే బదులు మళ్ళీ యువగళం పాదయాత్ర చేసుకొంటే మేము అడ్డుపడమని చెప్పొచ్చు కదా?

‘భువనేశ్వరిపైనే టిడిపి భారం మోపారా?’ అని అడుగుతున్న విజయ సాయిరెడ్డికి, తామందరం చంచల్‌గూడా జైల్లో కొలువు తీరినప్పుడు, వైసీపి చెల్లా చెదురు అయిపోకుండా కాపాడిన వైఎస్ విజయమ్మ, షర్మిల ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?ఎలా ఉన్నారని అడగొచ్చు కదా?

దగ్గుబాటి పురందేశ్వరి గురించి వైసీపి ఆందోళన దేనికంటే ఆమె బీజేపీని టిడిపితో పొత్తులకు అంగీకరింపజేస్తారనే కదా?

ఇంతవరకు వైసీపి ఏమేమి జరగకూడదని కోరుకొంటోందో సరిగ్గా అవే జరుగుతున్నాయి. కనుక విజయ సాయిరెడ్డి ఇలాంటి ఆలోచనలు పెట్టుకొంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటారని మరిచిపోకూడదు.