vijaya-sai-reddy-ysrcp

విజయసాయి రెడ్డి అక్రమాస్తుల కేసులలో ఏ-2గా ఉన్నారు. ఆ కేసులో 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు. విశాఖలో భూకబ్జాల ప్రస్తావనలో ఆయన పేరు తప్పకుండా వినపడుతూనే ఉంటుంది. ఇటీవలే ‘శాంతి పురాణం’లో కూడా ఆయన పేరు వైరల్ అయ్యింది.

అయితే ఎన్ని తప్పులు, పాపాలు చేసినా డబ్బు, పదవి, అధికారం… ఈ మూడు ఉంటే చాలు అవన్నీ కప్పడిపోయి పెద్దమనిషిలా రాజ్యసభలో కూర్చోనే అర్హత లభించేస్తుంది. పెద్దల సభలో ఛైర్మన్‌ కుర్చీలో కూర్చుని సభ నడిపించినప్పుడు ఇక ఆయన ఏం మాట్లాడినా అంతా జనం నమ్మేయాల్సిందే. లేకుంటే శపించేస్తారు.

Also Read – దువ్వాడ రాజీ ఒప్పందం… జనసేనకు ఓకేనా?

తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో తన ఏ-1 సహచరుడు జగన్‌పై యావత్ దేశ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతుంటే, ఏ-2 ఆయనని వెనకేసుకువస్తే ఎవరూ తప్పు పట్టరు. కానీ ఇంత ఘన చరిత్ర కలిగిన ఏ-2 ఈ అపచారాన్ని బయటపెట్టి విచారణ జరిపిస్తున్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుండటం సిగ్గుచేటు.

“హిందూ మతాన్ని నమ్మడం, వాడుకోవడం … ఈ రెండు వేరు వేరు… నిజమైన హిందువు దేవుని, హిందూ మతాన్ని నమ్ముకుంటాడు, రాజకీయ అజ్ఞాని చంద్రబాబులాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు దేవుడినీ మతాన్ని వాడుకుంటారు… @ncbn” అని ట్వీటేశారు.

Also Read – 2027లో జమిలి ఎన్నికలు… చంద్రబాబు నాయుడు సై?

విజయసాయి రెడ్డికి హిందూ మతంపై నిజంగా అంత అభిమానం, గౌరవం ఉండి ఉంటే గత 5 ఏళ్ళ జగన్‌ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాలు ధ్వంసం అవుతున్నప్పుడు, రధాలు తగులబడుతున్నప్పుడు, రధాలలో వెండి సింహాలు దొంగతనమైనప్పుడు ఎంపీ రఘురామ కృష్ణరాజులా జగన్మోహన్‌ రెడ్డిని నిలదీసి ఉండాలి.

కానీ నిలదీస్తే అరికాళ్ళు వాచిపోతాయని, అప్పుడు ఏ దేవుడూ వచ్చి తనని కాపాడడని విజయసాయి రెడ్డికి తెలుసు. కనుక ఆ దేవుడిని ప్రార్ధించడం కంటే జగన్‌ భజన చేస్తూ కాలక్షేపం చేయడమే మంచిదని ఫిక్స్ అయ్యారు.

Also Read – ఆహా అనిపించిన బాలయ్య అన్ స్టాపబుల్…!


అందుకా జగన్‌ దేవుడు ప్రసన్నం అయ్యి లోక్‌సభ ఎన్నికలలో నెల్లూరు టికెట్‌ ప్రసాదించారు కూడా. కానీ పైనున్న అసలు దేవుడు నెల్లూరు ప్రజలు కరుణించక పోవడంతో ఎన్నికలలో ఓడిపోయారు. కానీ నేటికీ విజయసాయి రెడ్డిలో తీరు మారలేదు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. కనుక ఓసారి తిరుమల వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచిదేమో?