భట్ సినిమాలో ఎన్ని ముద్దులున్నా అభ్యంతరం లేదు!

vikram-bhatt-censorబాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ పై సెన్సార్ బోర్డు అధ్యక్షుడు పహ్లాజ్ నిహ్లానీ తీవ్ర విమర్శలు చేశారు. విక్రమ్ భట్ క్యాంప్ వారి వ్యాపార సూత్రం సెన్సార్ బోర్డుపై విమర్శలు చేయడమని, వారు తీసిన సినిమాల విడుదలకు ముందు సెన్సార్ బోర్డుపై విమర్శలు చేయడం పబ్లిసిటీలో భాగమని పేర్కొన్నారు. విక్రమ్ భట్ సినిమాల్లో ఎన్ని ముద్దు సన్నివేశాలున్నా, లేకున్నా తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు.

విక్రమ్ భట్ క్యాంపుకు సెన్సార్ బోర్డు వ్యాపార సాధనంగా మారిందని, అందుకే తమ క్యాంపుకు సంబంధించిన సినిమాల విడుదల సమయంలో సెన్సార్ బోర్డుపై విమర్శలు చేయడం ద్వారా వ్యాపారం, సినిమాపై ఆసక్తి పెంచుతారని ఎద్దేవా చేశారు. తొలుత విమర్శలు చేస్తారని, ఆ తరువాత సెన్సార్ బోర్డు సభ్యులను రెచ్చగొడతారని మండిపడ్డారు. అలాంటి వారికి ఉచిత పబ్లిసిటీ ఎందుకివ్వాలనే ఉద్దేశంతోనే తాము స్పందించమని అన్నారు.

ADVERTISEMENT

కాగా, విక్రమ్ భట్ తాజా ‘హారర్’ సినిమా “రాజ్ రీ బూత్”లో ‘ఎఫ్’ అనే పదం వాడడాన్ని 32 సార్లు నుంచి 16 సార్లుకి తగ్గించాలని సెన్సార్ బోర్డు సూచించిందని, అలాగే తమ సినిమా థియేటర్ ట్రైలర్ కు ‘యూ/ఏ’ సర్టిఫికేట్, టీవీలో ప్రదర్శించే ట్రైలర్ కు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారని ఇదేం విధానమంటూ ‘సెన్సార్ బోర్డు’పై విక్రమ్ భట్ మండిపడిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories