బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న “వినయ విధేయ రామ” సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా, ప్రస్తుతం అందరి కళ్ళు ఈ టీజర్ విడుదల వైపు ఉన్నాయి. 9వ తేదీన ఈ టీజర్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ముందే ప్రకటించగా, తాజా సమయాన్ని కూడా ఖరారు చేసారు.
ADVERTISEMENT
[m9ad]
ఉదయం 10.25 గంటలకు మెగా మాస్ టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా స్పష్టం చేసారు. ఫస్ట్ లుక్ లో కనిపించిన రామ్ చరణ్ యాక్షన్ పాళ్ళను కొనసాగిస్తూ… ఈ టీజర్ కూడా మాస్ గా ఉండబోతుందని ముందే చెప్పడంతో, మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబరాయ్ విలన్ గా నటిస్తున్నాడు.
ADVERTISEMENT



