తెలుగు బుల్లితెర ప్రేక్షకుల దృష్టంతా ప్రస్తుతం ‘బిగ్ బాస్’ హౌస్ లో విజేతగా ఎవరు నిలుస్తారు? అన్న దాని పైనే. ప్రస్తుతం హౌస్ లో మిగిలిన ఐదుగురి సభ్యులలో టైటిల్ ఎవరిని వరిస్తుందో అన్న సందేహం అందరిలో ఉన్నా… యాంకర్ హరితేజ మిగతా వారికన్నా కొంత ముందుచూపుతో వ్యవహరించడం హాట్ టాపిక్ అయ్యింది. ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్లడానికి ముందే తన తెలివితేటలు ఏపాటివో అని చెప్పడానికి నిదర్శనంగా, తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాను ఫైనల్స్ వరకూ ఉంటానన్న నమ్మకంతో, ఆమె ముందే ఓ వీడియోను సిద్ధం చేసుకుని, తన స్నేహితురాలికి ఇచ్చింది. తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఈ వీడియోలో కోరింది. తన దగ్గరి సన్నిహితురాలు వింధ్యా విశాఖతో కలసి ఓ సెల్ఫీ వీడియోను చిత్రీకరించింది హరితేజ. ఆ వీడియోను ఇప్పుడు వింధ్య సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది కాస్త వైరల్ అయింది. తన ఫ్రెండ్ ను గెలిపించాలని కోరుతూ వింధ్య ఈ వీడియోను పోస్టు చేయగా… హరితేజ ముందస్తు తెలివితేటలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


