కోహ్లి ఒక్క నిర్ణయం… 11 కోట్లు అవుట్..!

Virat Kohli contract disallows him to shoot Goibibo ad with Deepika padukoneబాలీవుడ్‌ నటి దీపికా పదుకునేతో యాడ్‌ లో నటించనని ఐపీఎల్ లో బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యానికి 11 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్తే… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాంట్రాక్టులోని ఒక క్లాజు ప్రకారం కోహ్లీ మరే ఇతర సెలబ్రిటీతో యాడ్ షూటింగ్ లో పాల్గొనేందుకు వీలు లేదు. అదే సమయంలో గోఐబిబో.కామ్ కోహ్లీతో యాడ్ లో నటింపజేసేందుకు ఆర్సీబీతో ఒప్పందం ఉంది.

ADVERTISEMENT

ఆ ఒప్పందం ప్రకారం ఆ వెబ్ సైట్ కు కోహ్లీ యాడ్ లో నటించాలి. గో ఐబిబోకు దీపికా పదుకునే ఇప్పటికే యాడ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికతో కోహ్లీ నటించాలని ఆర్సీబీకి, గోఐబిబో చెప్పింది. కాంట్రాక్టు ప్రకారం కోహ్లీ మరో సెలబ్రిటీ (దీపిక) తో నటించేందుకు నిరాకరించాడు. దీంతో ఆర్సీబీతో గోఐబిబో 11 కోట్ల విలువైన డీల్ ను రద్దు చేసుకుంది. అలా కోహ్లీ వల్ల ఆర్సీబీకి 11 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

ADVERTISEMENT
Latest Stories