సరిగ్గా వాడుకుంటే దెయ్యాలు కలెక్షన్లు కురిపిస్తాయి

Virupaksha Romanchamదేవుడిని భక్తితో కొలుస్తాం దెయ్యానికి భయంతో వణుకుతాం. ఇది యునివర్సల్ ట్రూత్. అంటే ప్రపంచ సత్యం. నిజంగా మనిషి చనిపోయాక ఆత్మ రూపంలో ఉంటాడో లేదో చెప్పడానికి శాస్త్రీయ ఆధారమేమీ లేదు కానీ ఆ నమ్మకమే శ్మశానాల దగ్గరకు వెళ్లకుండా చేస్తుంది. కొన్ని వందల కోట్ల వ్యాపారానికి ఊతంగా నిలుస్తుంది. అందులో సినిమా కూడా కూడా ఒకటి. సరిగ్గా వాడుకోవాలే కానీ హారర్ జానర్ తో కలెక్షన్ల వర్షం కురిపించుకోవచ్చు. మొన్న ఈవిల్ డెడ్ రైజ్ అర్ధరాత్రి షోలు వేస్తే చాలా చోట్ల హౌస్ ఫుల్ అయ్యాయి. ఆ సిరీస్ కున్న క్రేజ్ అది. జాంబీస్ కాన్సెప్ట్ తో హాలీవుడ్ నుంచి జపాన్ దాకా లెక్కలేనన్ని వెబ్ సిరీస్ లు అన్ని ఓటిటిలోనూ ఉన్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ లో తాజాగా బ్లాక్ బస్టర్ గా చెప్పుకుంటున్న విరూపాక్షలో ఉన్నది చేతబడులు, కనిపించని ప్రేతాత్మలే. వీటి చుట్టే దర్శకుడు కార్తీక్ దండు కథను అల్లుకున్నాడు. అయితే ఇది ఇప్పటి ట్రెండ్ కాదు. హాలీవుడ్ లో డ్రాకులాకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. ఎగ్జార్సిస్ట్ ని ఒంటరిగా చూసేందుకు ఆడియన్స్ గజగజ వణికేవారు. ముప్పై ఏళ్ళ క్రితం హిందీలో రామ్ సే బ్రదర్స్ చాలా చీప్ బడ్జెట్ లో ఇలాంటి సినిమాలు తీస్తే రూపాయికి పది రూపాయల లాభం వచ్చేది. చాలామంది వీటిని స్ఫూర్తిగా తీసుకుని సి గ్రేడ్ చిత్రాలు తీసేవాళ్ళు. దాదాపు అన్నీ విజయవంతమైనవే.

ADVERTISEMENT

కెరీర్ పీక్స్ కు వెళ్లిన టైంలో స్టార్లు వెంటపడుతున్నా సరే వాళ్ళను కాదనుకుని రామ్ గోపాల్ వర్మ రాత్రి తీశాడు. రిలీజైన టైంలో గొప్పగా ఆడలేదు కానీ దాన్నే తిరగరాసి చేసిన భూత్, డర్నా మనా హై, దెయ్యం లాంటివి సూపర్ హిట్టయ్యాయి. పదుల కోట్లు తేలేదు కానీ వాటికైన బడ్జెట్ కి రెట్టింపు లాభాలిచ్చాయి. అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోలు నటించేందుకు రెడీ అయ్యారు. తెలుగులో రాజేంద్రప్రసాద్ కాష్మోరా ఇదే విభాగంలోకి వస్తుంది. సైడ్ ఆర్టిస్ట్ గా రాణించే చిన్నా కొన్నేళ్ల క్రితం ఆ ఇంట్లోని స్వీయ దర్శకత్వంలో తీస్తే బిసి సెంటర్లలో బాగా ఆడి నిర్మాతకు డబ్బులు తెచ్చింది. పల్లెటూళ్ళలో మూఢనమ్మకాలు నగరానికి తీసుకురావడంలో ఇక్కడ చెప్పినవన్నీ సక్సెస్ అయ్యాయి.

సస్పెన్స్ థ్రిల్లర్స్ ని హారర్ మూవీస్ ని ఒకే గాటన కట్టలేం. మొదటివి థ్రిల్ ఇస్తే రెండోవి భయాన్ని పుట్టిస్తాయి. జడుసుకుంటామని తెలిసినా కూడా టికెట్లు కొనిమరీ ఎంజాయ్ చేసే బాపతు కోట్లలో ఉన్నారు. విరూపాక్ష కావొచ్చు భవిష్యత్తులో వచ్చే ఇంకేదైనా కావొచ్చు. భయాన్ని క్యాష్ చేసుకోవడమనేది గొప్ప ఆర్ట్. దానికి ఇమేజ్ ఉన్న హీరోలు కనక తోడైతే మార్కెట్ పరంగా రీచ్ పెరిగి మరికొందరు ప్రయోగాలు చేయడానికి సిద్ధపడతారు. ఇటీవలే మలయాళంలో రోమంచం అనే చిన్న సినిమా వచ్చింది. ఆత్మలతో మాట్లాడే ఔజా బోర్డ్ గేమ్ ఆధారంగా కామెడీ టచ్ ఇచ్చి రెండు కోట్లతో తీస్తే డెబ్భై కోట్లు వసూలు చేసింది. హారర్ మహత్యం అలా ఉంటుంది మరి.

ADVERTISEMENT
Latest Stories