విశాఖ రాజధాని.. దానిలో ఓ ఎంపీ… ఆయన కుటుంబం కిడ్నాప్!

Vizag MP MVV-Satyanarayana-Wife-Son-Kidnappedవైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు కధ చెప్పడం మొదలుపెట్టి విశాఖ రాజధాని వరకు వచ్చి నాలుగేళ్ళుగా అక్కడే ఆగిపోయింది. అలాంటి కాబోయే రాజధాని నగరంలో అధికార వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు చందు, వారి కుటుంబ స్నేహితుడు, ఆడిటర్ గన్నమనేని వేంకటేశ్వర రావు కిడ్నాప్ అయ్యారు. వారు ఆనందపురం వద్ద కిడ్నాప్ అయిన్నట్లు పోలీసులకు సమాచారం అందించడంతో 17 పోలీసు బృందాలతో కిడ్నాపర్లను కార్లలో ఛేజింగ్ చేసి నిందితులను పట్టుకొన్నారు.

ADVERTISEMENT

ఎంపీ భార్య, కుమారుడు, వారి కుటుంబ స్నేహితుడు ముగ్గురూ క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలియజేశారు. ఈవిదంగా కిడ్నాపులకు పాల్పడే హేమంత్ అనే రౌడీషీటర్ వారిని కిడ్నాప్ సూత్రధారి అని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ గ్యాంగ్ వివరాలను త్వరలో తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.

విశాఖను రాజధానిగా చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెపుతుండటంతో భూబకాసురులు అందరూ వచ్చి విశాఖ మీద వాలిపోయి పోటీలు పడి భూములు కబ్జాలు చేస్తున్నారు. దసపల్లా భూముల వ్యవహారం చాలా రోజులు వార్తలలో నానిన సంగతి అందరికీ తెలిసిందే.

విశాఖలో ఇంతవరకు భూకబ్జాల వార్తలు వినపడుతున్నాయి కానీ కిడ్నాప్ వార్తలు వినపడవు. కానీ ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకే చెందిన ఓ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ కాబడటంతో విశాఖ నగర ప్రజలు ఉలిక్కి పడ్డారు.

ఓ ఎంపీ కుటుంబం పరిస్థితే ఈవిదంగా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏవిదంగా ఉంటుందో? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అవడం చూస్తే ప్రశాంతమైన విశాఖనగరంలో పరిస్థితులలో ఎంత మార్పు వచ్చిందో ఊహించుకోవచ్చు.

విశాఖ రాజధాని కాబోతోందని ప్రభుత్వం చెపుతోంది కనుక నగరం అభివృద్ధి చేస్తారని ప్రజలు ఎదురుచూస్తుంటే, ఏమాత్రం జరుగలేదు కానీ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతుండటం అందరినీ కలవరపెడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories