పూర్తి మెజారిటీతో ఉన్న మోడీ సర్కార్ నిరంకుశంగా పరిపాలిస్తోందని ఇప్పటికే విమర్శలు మూటకట్టుకుంటున్న విషయం తెలిసిందే. దీనికి తోడు తాజాగా ఈశాన్య రాష్ట్రాలలో జయకేతనం ఎగురవేయడం వీరి ఆగడాలు మరింత పెచ్చుమీరేలా చేస్తోందన్నది పొలిటికల్ వర్గాల మాట. అందుకు నిదర్శనంగానే త్రిపురలో గద్దెనెక్కిన మరుసటి రోజే లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసిందని మీడియా వర్గాలు కూడా పేర్కొంటున్నాయి.
త్రిపురలో రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న మాణిక్ సర్కారును గద్దె దించామన్న ఆనందంలో ఉన్న బిజెపి కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. బెలోనియా కాలేజ్ లో ఉన్న ప్రపంచ వామపక్ష నేత వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాన్ని ఓ బుల్డోజర్ సాయంతో కూల్చేసిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. మాణిక్ సర్కారు సీఎం పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఇది జరగడం గమనార్హం. దీంతో బీజేపీ మార్క్ పాలన అప్పుడే మొదలైందని వామపక్షాలు విమర్శించాయి.
#WATCH: Statue of Vladimir Lenin brought down at Belonia College Square in Tripura. pic.twitter.com/fwwSLSfza3
— ANI (@ANI) March 5, 2018



