బయోపిక్ – మహేష్ బాబు అయితే బాగుంటుంది!

VVS Laxman wants mahesh babu to do his biopicఒకప్పుడు బాలీవుడ్ లో సందడి చేసిన బయోపిక్ లకు, ప్రస్తుతం టాలీవుడ్ లో కేరాఫ్ అడ్రస్ గా మారింది. సినీ, రాజకీయ నాయకుల జీవితాలు వరుసగా తెరరూపం సిద్ధించుకుంటున్న తరుణంలో… ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన బయోపిక్ కు సంబంధించిన అనుభూతులను మీడియాతో పంచుకున్నారు.

ADVERTISEMENT

[m9ad]

దాదాపుగా రెండేళ్ళ క్రితం ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ దర్శకులు తన బయోపిక్ కోసం సంప్రదించారని, కానీ అపుడు తన సంగతులను చెప్పలేకపోయానని, ప్రస్తుతం తన జీవితకధను పుస్తక రూపంలో తీసుకువస్తున్నానని, ఇందులో తనకు సంబంధించిన అన్ని విషయాలు ఉంటాయని ఈ స్టైలిష్ బ్యాట్స్ మెన్ చెప్పుకొచ్చారు.

ఇక తన బయోపిక్ ను సినిమాగా తెరకెక్కిస్తే, అందులో మహేష్ బాబు నటిస్తే బాగుంటుందని, తనకు మహేష్ అంటే చాలా ఇష్టమని, మహేష్ నటించే ప్రతి సినిమాను ఎంజాయ్ చేస్తుంటానని తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే ఇలాంటి బయోపిక్ లకు ప్రిన్స్ కాస్త దూరం అన్న సంగతి వీవీఎస్ కు తెలియదేమో!

ADVERTISEMENT
Latest Stories