జగన్ ఎక్కడ ముగించాడో…పవన్ అక్కడ నుంచి మొదలుపెట్టాడు.!

pawan-jagan

2019 ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రిగా పదవి దక్కించుకోవడానికి.., 2014 , 2024 ఎన్నికలలో జగన్ ప్రతిపక్షానికి పరిమితమవ్వడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ADVERTISEMENT

2019 ఎన్నికలలో తానూ ఒంటరిగా పోటీ చేయడం వల్లనే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, దాని ఫలితంగా ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు విధ్వంస పాలన అనుభవించాల్సి వచ్చిందని భావించిన పవన్ 2024 ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ ప్రతిజ్ఞ చేసి దానికి తగ్గట్టుగా ఒక్కో అడుగు వేసుకుంటూ టీడీపీ తో పొత్తు మొదలుకుని బీజేపీ తో సమన్వయం వరకు అన్ని తానై నిలిచారు.

మూడు పార్టీల సమన్యయంతో, పోరాటాలతో, వ్యూహాలతో అటు బాబు, లోకేష్ తో పాటుగా ఇటు పవన్ కలిసి 164 సీట్లతో కూటమి విజయాన్ని, 100 % స్ట్రైక్ రేట్ తో జనసేనను విజయ తీరానికి తీసుకు రాగలిగారు. దానితో పాటుగా వైసీపీ ని 11 సీట్లకే పరిమితం చేయగలిగారు. అయితే గత ఎన్నికలలో మాదిరే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ను ఎలా అయినా ఓడించి అసెంబ్లీ గేటు తాకకుండా చేయడానికి జగన్ తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను వాడారు.

ఇందులో భాగంగా వైసీపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆఖరి సభను పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం లో నిర్వహించారు జగన్. పవన్ ను ఓడిస్తే మీ నియోజక వర్గ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న వంగా గీతను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తానంటూ హామీ కూడా ఇచ్చి 2024 వైసీపీ ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికారు జగన్. అయితే ఎక్కడైతే జగన్ ముగించారో అక్కడ నుంచే పవన్ తన విజయాన్ని మొదలుపెట్టారు.

గత ఎన్నికలలో పోటీ చేసిన 130 కి పై స్థానాలలో జనసేన కేవలం 1 సీటునే దక్కించుకోగలిగినప్పటికీ దానిని కూడా వైసీపీ హస్తగతం చేసుకోవడంతో గత అసెంబ్లీ సభలో జనసేన తన గళం వినిపించలేక పోయింది. ఇక జనసేన పార్టీకి సమాధి కట్టేసాం అని భావించిన జగన్ కు 2024 ఎన్నికలలో పిఠాపురం నుండే పవన్ తన తొలి విజయాన్ని అందుకున్నారు. అలాగే జగన్ చెప్పినట్లుగానే పిఠాపురం ఎమ్మెల్యే కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కింది.

దీనితో జగన్ ముగించిన దగ్గరే పవన్ మొదలు పెట్టారంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ పిఠాపురంలో వైసీపీ ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికి వైసీపీ 151 సీట్ల గెలుపుకి అంతిమ యాత్ర చేస్తే…పవన్ 1 గా ఉన్న జనసేన గెలుపు కి 21 సీట్లతో ఉప ముఖ్యమంత్రి తో పాటుగా జనసేనకు మొత్తం 10 శాఖలకు గాను మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించి జనసేన విజయ యాత్రను ఆరంభించింది.

ADVERTISEMENT
Latest Stories