వైసీపి గెలిచినా ఓడినా… ముద్రగడకు కష్టమే?

Mudragada Padmanabham

మొదట జనసేనలో చేరడానికి సిద్దపడిన ముద్రగడ పద్మనాభం హటాత్తుగా యూటర్న్ తీసుకుని వైసీపిలో చేరారు. ఆ రోజు నుంచి పవన్‌ కళ్యాణ్‌ని ఓడించడమే తన జీవిత లక్ష్యమన్నట్లు మాట్లాడారు. అంటే పవన్‌ కళ్యాణ్‌ని ఓడించి పెడితే చాలని జగన్‌ ఆయనకు ‘సింగిల్ టాస్క్’ అప్పజెప్పిన్నట్లు భావించవచ్చు.

ADVERTISEMENT

ఆ ప్రయత్నంలో ఆయన తన హుందాతనాన్ని పక్కన పెట్టి హద్దులు మీరి వ్యాఖ్యలు చేయగా, పవన్‌ కళ్యాణ్‌ ఏమాత్రం పట్టించుకోకుండా చాలా హుందాగా వ్యవహరించారు. ఇద్దరి వ్యక్తిత్వాలలో కనిపించిన ఈ తేడాను పిఠాపురం ప్రజలు, రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. కనుక ఇకపై ఆయనకు తమ సామాజిక వర్గంలో పూర్వపు గౌరవ మర్యాదలు లభించకపోవచ్చు.

ఇది ఆయనకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం అనుకుంటే, ఒకవేళ ఈ ఎన్నికలలో వైసీపి, పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ గెలిస్తే ముద్రగడ పద్మనాభాన్ని జగన్‌ పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు రాష్ట్రంలో కాపులందరినీ వైసీపికి ఓట్లు వేయించమని పెద్ద టాక్స్ ఇవ్వలేదు. కేవలం పిఠాపురంలో వారిచేత వేయించి పవన్‌ కళ్యాణ్‌ని ఓడిస్తే చాలని కోరారు. ఇప్పటివరకు సర్వేలన్నీ పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ కనీసం 40 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించబోతున్నారనే సూచిస్తున్నాయి.

ఒకవేళ వైసీపి గెలిచి, పవన్‌ కళ్యాణ్‌ ఓడిపోయినా ఆ క్రెడిట్ ముద్రగడ పద్మనాభంకు మాత్రం దక్కకపోవచ్చు. ఎందుకంటే ఆయన కిర్లంపూడిలో కూర్చొని ప్రెస్‌మీట్‌లు పెట్టి పవన్‌ కళ్యాణ్‌ తిట్టిపోయడం తప్ప మరేమీ చేయలేదు. పిఠాపురంలో వైసీపి శ్రేణులే చెమటోడ్చాయి కనుక. మహా అయితే కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టవచ్చు.

ఇక ఈ ఎన్నికలలో టిడిపి కూటమి, పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ గెలిస్తే, ముద్రగడ పద్మనాభానికి కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంది.

ఈ ఉద్యమాలు, రాజకీయాల నుంచి ఎంతో హుందాగా, గౌరవప్రదంగా తప్పుకోవలసిన ముద్రగడ పద్మనాభం, చాలా అవమానకర పరిస్థితులలో తప్పుకోవలసి రావచ్చు. కానీ ఈ పరిస్థితులను ఆయనే చేజేతులా కొని తెచ్చుకున్నారు. కనుక ఎవరినీ నిందించడానికి కూడా లేదు.

ఇవన్నీ పక్కన పెట్టినా పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ గెలిస్తే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవలసి ఉంటుంది కదా?ఈ వయసులో ఆయనకు ఇంతకంటే పెద్ద అవమానం ఏముంటుంది?

ADVERTISEMENT
Latest Stories