ఈ సలహాలు ఇస్తుంది ఎవరు రా బాబు? తలకొట్టుకుంటున్న వైకాపా ఫ్యాన్స్

Who is advising ys jagan on goverment ordersజగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎందుకు చేస్తుందో ఆ పార్టీ సమర్ధకులకు కూడా అర్ధం కాని పరిస్థితి. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించాలని జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది.

హైకోర్టు తీర్పు అంత స్పష్టంగా ఉన్నా కూడా ఎందుకు రంగులు తొలగించలేదని, ఒక జీవో కొట్టి వేస్తే ఇంకో జీవో ఎందుకు తేవాల్సి వచ్చిందని సుప్రీం కోర్టు ప్రభుత్వం పై మండి పడింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వెయ్యడాన్ని సమర్ధించుకోవడం చాలా కష్టం. అసలు అవి కోర్టులలో ఎలా నిలబడతాయి అనుకున్నారో అర్ధం కాని విషయం.

ADVERTISEMENT

ఇప్పటికే ఇదే విషయంపై ఇప్పటికే హై కోర్టులో రెండు సార్లు, సుప్రీం కోర్టులో ఒకసారి వ్యతిరేక తీర్పులు వచ్చినా, మళ్ళీ ప్రభుత్వం సుప్రీం ని ఎందుకు ఆశ్రయించింది అంతుచిక్కని ప్రశ్న. అసలు దీనిని సుప్రీం కోర్టు ఎలా అనుమతిస్తాదని అనుకున్నారని పార్టీ అభిమానులకు కూడా అర్ధం కాకుండా ఉంది.

అసలు ప్రభుత్వానికి ఇంతమంది సలహాదారులు ఉన్నా ఇటువంటి తప్పుడు సలహాలు ఎవరు ఇస్తున్నారు అని వారు ఆగ్రహం చెందుతున్నారు. ఏదో ఒక సారి అంటే అనుకోవచ్చు. ఇప్పటికే 60-70 కేసులలో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు… పైగా దాదాపుగా అన్ని కేసులు ఇటువంటి విషయం లేని కేసులే. ఏం చెయ్యాలో? ఎవరిని నిందించాలో తెలియక వైకాపా ఫ్యాన్స్ తలకొట్టుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories