జగన్ ఖాతాలో బలయ్యే మొదటి వ్యక్తి ఎవరు.?

cm-ys-jagan-dictator

అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను తన చెప్పుచేతలలోకి తెచ్చుకోవడం జగన్ కు బూతులు తిట్టినంత ఈజీగా ఉంటుంది అని తన తండ్రి వైస్సార్ ప్రభుత్వంలో బలంగా రుజువు చేసుకున్నారు.

తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేనే లక్ష కోట్లు సంపాధించినట్లు ఆరోపణలు ఎదుర్కున్న జగన్ అదే ముఖ్యమంత్రి పదవి తన చేతులలో ఉంటే ఏమో చేయగలరో ప్రజల సొమ్ముతో ఇంకెంత జల్సాలు చేయగలరో రుషికొండ మీద నిర్మించిన భవనాలను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.

ADVERTISEMENT

గతంలో తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని మంత్రులుగా పని చేసిన నాయకులను, వారికి సహకరించే అధికారులను నయానో భయానో ఒప్పించి తనకు అవసరమైన ఫైళ్ల మీద సంతకాలు పెట్టించుకుని ఆ అధికారులను, మంత్రులను జైళ్లకు పంపించిన చరిత్ర జగన్ సొంతం.

అందులో వైస్సార్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మోపిదేవి వెంకటరమణ, ఐఏఎస్ గా బాధ్యతలు కొనసాగించిన శ్రీలక్ష్మి వ్యవస్థలను జగన్ కు అనుకూలంగా మార్చేశారనే ఆరోపణలతో జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. అయితే గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తూ, కొత్త వ్యవస్థలను సృష్టిస్తూ అసలు పాలన ఎలా చేయకూడదు అనేదాన్ని భవిష్యత్తు రాజకీయ నాయకులకు తెలియచెప్పారు.

అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని కోల్పోవడంతో గత ప్రభుత్వ తప్పిదాలను తవ్వి తీస్తూ ఒక్కో వ్యవస్థలో జరిగిన అవినీతిని బయటకు తీస్తున్నారు అధికారులు. ఈ అవినీతి కేసులలో ఇరుక్కుంటూ జగన్ చెప్పినట్లల్లా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ సంతకాలు పెట్టిన అధికారులు ఒక్కొక్కరుగా మళ్ళీ శ్రీ కృష్ణ జన్మస్థానానికి వెళ్ళడానికి సిద్దమయినట్లే.

ఇందులో ప్రభుత్వ అడ్వాకెట్ గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏపీ బేవరేజెస్ ఎండీ గా ఉన్న వాసుదేవ రెడ్డి, సిఐడి ఐజి గా చేసిన సునీల్, ప్రిన్సిపాల్ సెక్రటరీ గా చేసిన ప్రవీణ్ ప్రకాష్, ఐఏఎస్ శ్రీ లక్ష్మి, మంత్రులుగా ఏపీని చేసిన రోజా, కొడాలి నాని ఇలా జగన్ ఖాతలో మొదటి దెబ్బ తినడానికి ఎవరు ముందుకు వస్తారో ఆ సువర్ణ అవకాశం ఎవరికీ దక్కుతుందో అనే చర్చ ఊపందుకుంది.

ADVERTISEMENT
Latest Stories